Rana Kapoor Arrested: ‘యస్’ అక్రమార్కుల తాట తీస్తోన్న సీబీఐ,ఈడీ, పలు చోట్ల సీబీఐ దాడులు, ఎఫ్ఐఆర్ నమోదు, రాణా కపూర్ అరెస్ట్, మార్చి 11 వరకూ ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ముంబై కోర్టు ఆదేశాలు
Yes Bank founder Rana Kapoor (Photo Credits: IANS)

Mumbai, Mar 09: యస్ బ్యాంక్ సంక్షోభంలో (YES Bank crisis) అసలు దోషుల బెండు తీసేందుకు ఈడీ, సీబీఐ (ED And CBI) రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఈ బ్యాంకు కో– ఫౌండర్‌‌, మాజీ సీఈఓ రాణా కపూర్‌‌ను ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టర్‌‌ (ఈడీ) శనివారం అరెస్టు (YES Bank co-founder Rana Kapoor) చేసింది.

ఇక సీబీఐ (CBI) కూడా రంగంలోకి దిగి కపూర్‌‌తోపాటు డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌పైనా (DHFL) కేసులు పెట్టింది. అలాగే యస్‌ బ్యాంక్‌ కేసుకు (YES Bank Case) సంబంధించి ముంబైలో బ్యాంక్‌ వ్యవస్ధాపకుడు రాణా కపూర్‌, ఇతరులకు సంబంధించిన ఏడు చోట్ల సీబీఐ అధికారులు సోమవారం దాడులు చేపట్టారు.

రాణా కపూర్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఆరేకేడబ్ల్యూ డెవలపర్స్‌, దోయిత్‌ అర్బన్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిడెట్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ బాంద్రా కార్యాలయ ప్రాంగణాల్లో దాడులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. యస్‌ బ్యాంక్‌ సంక్షోభానికి సంబందించి సీబీఐ ఈనెల ఏడున యస్‌ బ్యాంక్‌ మాజీ చీఫ్‌ రాణా కపూర్‌, ఆయన కుటుంబానికి చెందిన దోయిత్‌ అర్బన్‌ వెంచర్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్‌ కపిల్‌ వాధ్వాన్‌ తదితరులపై నేరపూరిత కుట్ర, 420 సహా పలు సెక్షన్ల కింద సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

రాణా కపూర్ ఇంట్లో ఐటీ సోదాలు, దేశం విడిచిపోకుండా లుక్‌ ఔట్‌ నోటీసు జారీ

యస్‌ బ్యాంక్‌ అక్రమంగా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు ఆర్థిక సాయం చేసేందుకు కపిల్‌ వాద్వాన్‌ ఇతరులతో కలిసి రాణా కపూర్‌ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, ప్రతిగా తనకు, తన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలకు బారీ లబ్ధి పొందారని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. కాగా సీబీఐ దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో గతంలోనే ఈడీ దాడులు చేపట్టింది. ఇప్పటికే యస్‌ బ్యాంక్‌ ఫౌండర్‌ రాణా కపూర్‌పై ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది.

యస్ బ్యాంక్ రీకన్‌స్ట్రక్షన్ స్కీమ్, మారటోరియం విధించిన 24 గంటల తర్వాత ప్లాన్

మరోవైపు ముంబైలోని స్పెషల్‌‌ హాలిడే కోర్టు కపూర్‌‌కు ఈ నెల 11 వరకు పోలీసు కస్టడీ విధించింది. బ్యాంక్‌ని ఆర్ధిక సంక్షోభం నుంచి బైట పడేసేందుకు RBI రంగంలోకి దిగిన వెంటనే అసలు బ్యాంక్‌ ప్రస్తుత దుస్థితికి కారణం ఎవరనే కోణంలో కేంద్రం దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే యెస్ బ్యాంక్ ఫౌండర్ రాణాకపూర్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఇంటరాగేట్ చేసింది.

యస్ బ్యాంకులో 49 శాతం వాటాల కొనుగులుకు ఎస్‌బిఐ బోర్టు ఆమోదం

ముంబై వర్లీ ఏరియాలోని ఆయన నివాసంలో సోదాలు జరిపింది. ఆ తర్వాత మనీ లాండరింగ్‌కి పాల్పడ్డారనే నిర్ధారణతో అరెస్ట్ చేసింది. ఈ కేసులోనే అతనిపై సీబీఐ కూడా FIR దాఖలు చేసింది. రాణాకపూర్ బ్యాంక్ వ్యవస్థాపకుడిగా తనకి ఉన్న వెసులుబాటుని ఉపయోగించుకుని అనేక షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి.

ఇకపై రూ.50 వేల కంటే ఎక్కువ నగదు ఉపసంహరించుకోరాదు

గతంలో దివాలా తీసీన డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ నుంచి యెస్‌‌ బ్యాంకు రూ.3,700 కోట్ల విలువైన డిబెంచర్లు కొన్నది. బదులుగా డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌… కపూర్‌‌ కూతుళ్లు డైరెక్టర్లుగా ఉన్న డాయిట్‌‌ అర్బన్‌‌ వెంచర్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌కు కొల్లేటర్​ లేకుండా రూ.600 కోట్ల విలువైన లోన్‌‌ ఇచ్చింది. డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌, యెస్ బ్యాంక్‌‌ ప్రమోటర్లు వాధ్వాన్‌‌, కపూర్‌‌లు కుట్ర చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. రూ.4,300 కోట్ల విలువైన ప్రజాధనం దుర్వినియోగం అయింది. రూ.రెండు వేల కోట్ల విలువైన ఇన్వెస్ట్‌‌మెంట్లు, 44 ఖరీదైన పెయింటింగ్స్‌‌, 12 షెల్‌‌ కంపెనీలు, కపూర్‌‌ విదేశీ ఆస్తులపై దర్యాప్తు కొనసాగుతోంది’’ అని ఈడీ తెలిపింది.

యస్ బ్యాంక్ సంక్షోభంపై ఆందోళన వద్దు, కస్టమర్ల సొమ్ము ఎక్కడికీ పోదు

ఈ ఒక్క కంపెనీ నుంచే రాణాకపూర్ ఫ్యామిలీకి రూ. 600 కోట్లు ముడుపుల రూపంలో ముట్టినట్లు ఈడీ తేల్చింది. ఇంకా DHFL తరహాలోనే..చాలా కార్పొరేట్ కంపెనీలు కపూర్‌ ఫ్యామిలీకి చెందిన షెల్ కంపెనీలకు సొమ్ము తరలించినట్లు తెలుస్తోంది. ఇలా సైడ్ చేసిన సొమ్ముతో రాణాకపూర్ ఫ్యామిలీ దాదాపు 2 వేల కోట్ల రూపాయలను ఇతర ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేసినట్లు ఈడీ గుర్తించింది.

అక్రమ మార్గాల్లో నిధులు స్వీకరించిన కపూర్‌ కుటుంబం రూ 2000 కోట్ల వరకూ వివిధ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. వీటి విలువ ప్రస్తుతం 5 వేల కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. యెస్ బ్యాంక్‌ వ్యవహారంలో కేంద్రం కఠిన చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీబీఐ కూడా రంగంలోకి దిగింది. ఈడీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐతో కలిసి సంయుక్తంగా దర్యాప్తు చేయబోతోంది.

యస్ బ్యాంకు సంక్షోభం, ప్రధాని మోదీపై విరుచుకుపడిన రాహుల్ గాంధీ

కాగా మొండి బాకీలు, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాలతో కుదేలైన యస్‌ బ్యాంక్‌ బోర్డును రద్దు చేసి ఆర్‌బీఐ తన అధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే 30 రోజుల పాటు రూ. 50,000కు మించి విత్‌డ్రాయల్స్‌ జరపడానికి లేకుండా మారటోరియం కూడా విధించింది. దీనితో ఆ బ్యాంకు జారీ చేసిన ఫారెక్స్‌ కార్డులు పనిచేయక, వాటిని తీసుకున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఖాతాదారులు ఆందోళన చెందవద్దు :RBI

తప్పుడు విశ్లేషణలు చూసి కొన్ని బ్యాంకుల్లో డిపాజిట్ల గురించి ఖాతాదారులు ఆందోళన చెందవద్దంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ మరోసారి భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. అన్ని బ్యాంకులను సునిశితంగా పరిశీలిస్తూనే ఉన్నామని, డిపాజిట్ల భద్రతకు ఢోకా ఉండదని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో ఆర్‌బీఐ ట్వీట్‌ చేసింది. మార్కెట్‌ క్యాప్‌ ఆధారంగా బ్యాంకుల ఆర్థిక పరిస్థితి ఉండదని తెలిపింది.

అటు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ కూడా డిపాజిటర్లు ఆందోళన చెందవద్దని సూచించారు. బ్యాంకుల్లో సొమ్ము భద్రతను అంచనా వేసేందుకు వాటి మార్కెట్‌ క్యాప్‌ సరైన కొలమానం కాదని స్పష్టం చేశారు.

ఈ పరిస్థితులు ఇలా ఉంటే యస్‌ బ్యాంక్‌ నుంచి తమకు రూ. 662 కోట్లు రావాల్సి ఉందని ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది. బ్యాంక్‌ బాండ్లలో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేశామని, టర్మ్‌ లోన్‌ల రూపంలో బకాయిలేమీ లేవని పేర్కొంది. బ్యాంకు విలువ 10 బిలియన్‌ డాలర్ల పైగా ఉన్నప్పుడు.. 2017లో అదనపు టియర్‌ 1 (ఏటీ–1) బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసినట్లు తెలిపింది.

 రాణా కపూర్ కుమార్తె లండన్‌ ప్రయాణానికి బ్రేక్‌

లండన్‌ వెళ్లేందుకు సిద్ధమైన రాణా కపూర్‌ కుమార్తె రోషిణి కపూర్‌ ప్రయాణాన్ని ఈడీ అధికారులు అడ్డుకున్నారు. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానం ద్వారా లండన్‌ వెళ్లేందుకు ఆమె ఆదివారం ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చారు. రాణా కపూర్‌పై నమోదైన పీఎంఎల్‌ఏ కేసులో ఆమెను కూడా ప్రశ్నించాల్సి ఉన్నందున, ఆమె విదేశీ ప్రయాణాన్ని అనుమతించలేమని ఈడీ అధికారులు చెప్పారు. ఇందుకు సంబంధించి ఆమెపై లుక్‌ అవుట్‌ నోటీసు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. రాణా కపూర్‌ను మూడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించిన రోజే రోషిణి కపూర్‌ లండన్‌ వెళ్లేందుకు ప్రయత్నించడం పలు అనుమానాలకు తావిస్తోంది.