Yes Bank Crisis: ‘Under Psychiatric Treatment Since I Lost my Baby’, Former Founder Breaks Down in Court (photo-PTI)

Mumbai, Mar 09: యస్ బ్యాంకు ఆర్థిక సంక్షోభం (Yes Bank Crisis) దేశంలో ప్రకంపనలు రేకెత్తిస్తోంది. ఈ నేపధ్యంలో కేంద్రం ఈ సంక్షోభాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పరిష్కరించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా సీబీఐ, ఈడీలు (ED, CBI) యస్ బ్యాంకు అక్రమార్కుల తాట తీసేందుకు రెడీ అయ్యాయ. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్ ఫౌండర్ రాణా కపూర్ పై (Rana kapoor) సీబీఐ, ఈడీలు చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించాయి. ఈ సంధర్భంగా రాణా కపూర్ కోర్టులో ఏడ్చేశారు.

‘యస్’ అక్రమార్కుల తాట తీస్తోన్న సీబీఐ,ఈడీ, పలు చోట్ల సీబీఐ దాడులు

దివాళా కంపెనీలకు అడ్డదిడ్డంగా రుణాలు ఇచ్చి భారీగా ముడుపులు తీసుకున్నారన్న అభియోగాలపై ఈడీ కస్టడీలో ఉన్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఎస్ బ్యాంకు (YES Bank) వ్యవస్థాపకుడు రాణాకపూర్ ముంబై కోర్టుకు హాజరైనప్పుడు కోర్టులోనే న్నీటి పర్యంతమయ్యారు. విచారణాధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను' అంటూ చేతులెత్తి మొక్కుతూ కోర్టుకు విన్నవించుకున్నారు.

రాణా కపూర్ ఇంట్లో ఐటీ సోదాలు, దేశం విడిచిపోకుండా లుక్‌ ఔట్‌ నోటీసు జారీ

తన పాప పోయిన విషయాన్ని ఆయన కోర్టుకు తెలియజేస్తూ, పాపను పోగొట్టుకున్నప్పటి నుంచి తాను సైకియాట్రిక్ ట్రీట్‌మెంట్‌లో ఉన్నానని కూడా వాపోయినట్టు తెలుస్తోంది. 'నేను ఎక్కటికీ పారిపోవడం లేదు. నా పాస్‌పోర్ట్‌ను ఈడీ తీసుకోవచ్చు. నాకు కంటిమీద కునుకులేదు. అయినప్పటికీ రేయింబవళ్లు దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను' అని కపూర్ కోర్టుకు తెలిపారు.

రాణా కపూర్ అరెస్ట్, మార్చి 11 వరకూ ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ముంబై కోర్టు ఆదేశాలు

మనీ లాండరింగ్ ఆరోపణలపై కపూర్‌ను ఆదివారం ఉదయం ఈడీ అరెస్టు చేసింది. 20 గంటలకు పైగా అధికారులు విచారణ జరిపిన అనంతరం ఆయనను పీఎంఎల్ఏ కింద అరెస్టు చేశారు. వెటరన్ బ్యాంకర్ అయిన కపూర్ తమ విచారణకు సహకరించడం లేదని ఈడీ కోర్టుకు విన్నవించింది. దీంతో ప్రత్యేక కోర్టు ఈనెల 11 వరకూ కపూర్‌ను ఈడీ కస్టడీకి అప్పగించింది.

యస్ బ్యాంక్ రీకన్‌స్ట్రక్షన్ స్కీమ్, మారటోరియం విధించిన 24 గంటల తర్వాత ప్లాన్

ఇదిలా ఉంటే రాణా కపూర్‌ అవకతవకలపై సీబీఐ కూడా కేసు నమోదు చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్, డైరెక్టర్ కపిల్ వాద్వాన్‌తో కలిసి నేరపూరిత కుట్రకు కపూర్ పాల్పడ్డాడని, ఎస్ బ్యాంకు దావారా వాద్వాన్‌కు ఆర్థిక సాయం చేసి, ప్రతిఫలంగా తనకు, తన కుటుంబ సభ్యుల కంపెనీలకు అడ్డదారిలో అవసరమైన ప్రయోజనాలను పొందినట్టు సీబీఐ ఆరోపిస్తోంది.