Accident (Credits: X)

Newdelhi, Feb 2: హర్యానాలో (Haryana) ఘోర ప్రమాదం (Accident) జరిగింది. వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా జీపు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గల్లంతయ్యారు. ఇద్దరిని రక్షించారు. హర్యానాలోని ఫతేహాబాద్‌ జిల్లా సర్దారేవాలాలో ఈ ఘోరం చోటుచేసుకుంది. దట్టంగా కురుస్తున్న మంచు కారణంగానే ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. దారి కనిపించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. గల్లంతైన ముగ్గురి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.

హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం.. సమయానికి స్పందించడంతో తప్పిన ముప్పు (వీడియో)

పెళ్లికి వెళ్లి వస్తుండగా..

పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లాలో జరిగిన పెళ్లికి హాజరైన 14 మంది తిరిగి శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఇంటికి తిరిగి పయనమయ్యారు. ఈ క్రమంలో సర్దారేవాలా గ్రామం వద్ద జీపు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. మొత్తం 9 మంది చనిపోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, 11 ఏళ్ల బాలిక ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతులందరూ బంధువులు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

మంగళగిరి కొండపై మంటలు.. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఘోరం.. వ్యాపించిన దావానలం.. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమన్న ప్రజలు.. అనూహ్యంగా వాటంతట అవే ఆరిపోయిన మంటలు.. పానకాల లక్ష్మీనృసింహస్వామి మహిమేనంటున్న భక్తులు (వీడియో)