PM Modi (Photo-ANI)

New Delhi, Jan 24: 2002 గుజరాత్‌ అల్లర్లు, ఆ ఉదంతంలో ప్రధాని నరేంద్రమోదీ పాత్రపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. ఇది వివాదాస్పదం కూడా అయిన సంగతి విదితమే.  ఈ డాక్యుమెంటరీపై అగ్రరాజ్యం అమెరికా తాజాగా స్పందించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ గురించి తమకు తెలియదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు.

భారత్-అమెరికా బలమైన ప్రజాస్వామ్య దేశాలుగా ఉండటానికి కారణమైన భాగస్వామ్య విలువల గురించే తనకు తెలుసని చెప్పారు. మీరు అడుగుతున్న బీబీసీ డాక్యుమెంటరీ గురించి నాకు తెలియదు. కానీ భారత్-అమెరికా భాగస్వామ్య విలువల గురించి బాగా తెలుసు.

ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ, గుజరాత్ అల్లర్ల ప్రస్తావన ఉండటంతో మండిపడిన కేంద్రం, డాక్యుమెంటరీపై స్పందించిన యూకే ప్రధాని రిషి సునాక్‌

వీటి వల్లే రెండు దేశాలు బలమైన ప్రజాస్వామ్య, అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఉన్నాయి. ఇండియాలో జరిగిన పరిణామాల గురించి గతంలోనే కొన్ని సందర్భాల్లో మాట్లాడాం.' అని ప్రైస్ పేర్కొన్నారు. భారత్-అమెరికా అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు కావడానికి రాజకీయ, ఆర్థిక కారణాలతో పాటు ప్రజా సంబంధాలు అత్యంత ముఖ్యమైనవని ప్రైస్ వివరించారు.

ప్రధాని మోదీ, గుజరాత్ అల్లర్లకు సంబంధించి బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీని, యూట్యూబ్ లో బ్లాక్ చేయించిన సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ

2002 గుజరాత్‌ అల్లర్లు, ఆ ఉదంతంలో ప్రధాని నరేంద్రమోదీ పాత్రపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించింది. అల్లర్లకు మోదీనే బాధ్యుడని బ్రిటన్‌ ప్రభుత్వ రహస్య విచారణలో తేలిందని అందులో పేర్కొన్నది. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్‌’ పేరిట రూపొందించిన రెండు భాగాల్లో మొదటి ఎపిసోడ్‌ను ఇటీవల యూట్యూబ్‌ (ఇండియా)లో అప్‌లోడ్‌ చేసింది. అయితే, అప్‌లోడ్‌ చేసిన కొద్ది గంటల్లోనే కేంద్ర ఐటీశాఖ ఈ వీడియోను తొలగించింది.

డాక్యుమెంటరీలోని అంశాలను కేంద్రం ఖండించింది. ప్రభుత్వాన్ని అపఖ్యాతి చేయడానికి, ప్రచారంలో భాగంగానే బీబీసీ ఈ డాక్యుమెంటరీ తీసుకొచ్చిందని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ధ్వజమెత్తారు. కాగా, 2002 గుజరాత్‌ అల్లర్లలో ప్రధాని మోదీ పాత్ర గురించి వాదనలను పరిశీలించడం ఈ డాక్యుమెంటరీ ఉద్దేశంగా రూపకర్తలు వెల్లడించారు.