Hyderabad, October 25: హైదరాబాద్ లోని కూకట్ పల్లి డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేసే కోరేటి రాజు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆర్టీసీ విలీనం పేరుతో కార్మికుల్లో విషం నింపుతున్నారని, కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటూ వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు అని ఆరోపిస్తూ అశ్వత్థామ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆర్టీసీ విలీనం డిమాండ్ కార్మికులది కాదని, కేవలం అశ్వత్థామ వ్యక్తిగత కారణం అని డ్రైవర్ ఆరోపించాడు. అశ్వత్థామ రెడ్డికి సత్తా ఉంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతిని కలిసి సమస్య పరిష్కరించమని కోరాలి అంతేకాని అందర్నీ సమ్మెలోకి లాగవద్దు అన్ని అగ్రహంగా చెప్పాడు. ఆర్టీసీ ముగింపు కాదు, కేసీఆర్ ముగింపు ఉంటుంది. - అశ్వత్థామ రెడ్డి
మళ్ళీ దరఖాస్తు పెట్టుకుంటే ఉద్యోగంలో తీసుకుంటామని నిన్న సీఎం చెప్పారు, కాబట్టి నేను విధుల్లో చేరుతున్నానని చెప్పి కూకట్ పల్లి డిపోలో దరఖాస్తు పెట్టుకున్నాడు. తన సహచర కార్మికులందరూ కూడా సమ్మె బహిష్కరించి డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిందిగా డ్రైవర్ రాజు కోరుతున్నాడు.
ఆర్టీసీ సమ్మెను కొనసాగించడని కార్మికులకు లక్షణ్ పిలుపు
మరోవైపు ఆర్టీసీ జేఏసీ నాయకులు ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. లక్ష్మణ్ ను కలిశారు. ఆర్టీసీ సమ్మె భవిష్యత్ కార్యాచరణపై ఆయనతో ఆర్టీసీ జేసీసీ నాయకులు అశ్వత్థామ రెడ్డి, రాజిరెడ్డి చర్చలు జరిపారు. ఆర్టీసీపై ప్రధాని మోదీ చట్టాన్నే ఆచరణలో పెడుతున్నాం.- సీఎం కేసీఆర్
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడవద్దని ఆర్టీసీ కార్మికులకు సూచించారు. ఆర్టీసీ సమ్మెకు బీజేపీకి పూర్తి స్థాయిలో మద్ధతిస్తుంది. కేసీఆర్ వ్యవహారాన్ని కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేశాము. కేంద్రం కూడా సీరియస్ గానే ఉంది. అవసరమయితే ఈ ఆర్టీసీ సమ్మెను ఢిల్లీ స్థాయికి తీసుకెళ్తాం. ఆర్టీసీ కార్మికులు నిర్భయంగా, యతాతథంగా సమ్మెను కొనసాగించాలని లక్షణ్ పిలుపునిచ్చారు.
ఇక, సీఎం బెదిరింపులకు ఎవరూ భయపడటం లేదని అశ్వత్థామ రెడ్డి అన్నారు. కార్మికులను చులకన చేసి మాట్లాడారు, న్యాయస్థానాలను కేసీఆర్ లెక్క చేయలేదు. కార్మిక సంఘాలను విచ్ఛిన్నం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. హుజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితం ఆర్టీసీ సమ్మెతో సంబంధం లేనిదని అశ్వత్థామ తెలిపారు. ఇక ముందు తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని తెలిపిన ఈనెల 30న సకలజనసభను పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.