Jaipur, July 27: రాజస్తాన్ రాజకీయ పరిణామాలు (Rajasthan Political Drama) శరవేగంగా మారుతున్నాయి. జూలై 31 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసిన అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారు. ఇక సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషి (CP Joshi) సోమవారం ఉపసంహరించుకున్నారు. సచిన్ పైలట్‌తో పాటు 18 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ స్పీకర్ సుప్రీంలో (Supreme Court) పిటిషన్ దాఖలు చేశారు. రాజస్థాన్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో న్యాయ పోరాటం వద్దని... రాజకీయంగానే ఎదుర్కోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం తాజాగా ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ నిర్ణయంతోనే స్పీకర్ ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతుండగా.. అసెంబ్లీని సమావేశాలకు సంబంధించిన ఫైల్‌ను గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా (Governor) వెనక్కి పంపించారు. దీనిపై మరింత అదనపు సమాచారం కావాలంటూ శాసనసభా వ్యవహారాల శాఖను ఆదేశించారు. అయితే తాము బల పరీక్షకు అసెంబ్లీని సమావేశపరచాలని అడగడం లేదని, కరోనాపై చర్చించడానికి అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచాలని, అలాగే 6 బిల్లులను ప్రవేశ పెట్టడానికి అసెంబ్లీని సమావేశపరచాలంటూ కొత్త వ్యూహంతో ముందుకు వచ్చారు. సచిన్ పైలట్‌పై విరుచుకుపడిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, హైకోర్టులో కొనసాగుతున్న విచారణ, పైలట్ అనర్హతపై కోర్టు జోక్యం చేసుకోలేదని తెలిపిన న్యాయవాది అభిషేక్ మనూ సంఘ్వి
కాగా అసెంబ్లీని తక్షణమే సమావేశపరచాలని, తాను బల పరీక్షకు సిద్ధంగా ఉన్నానంటూ ముఖ్యమంత్రి గవర్నర్ మిశ్రాను కోరుతున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలతో ఏకంగా రాజ్‌భవన్ ముందు సీఎం ధర్నాకు దిగిన విషయం విదితమే. అసమ్మతి నేత సచిన్ పైలట్ వర్గానికి స్పీకర్ అనర్హత నోటీసులు ఇచ్చిన తర్వాత... వారంతా హైకోర్టును ఆశ్రయించారు. తుది తీర్పు వచ్చే వరకూ యథాతథ స్థితినే కొనసాగించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ స్పీకర్ జోషి సుప్రీంలో వ్యాజ్యం వేశారు. వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయండి, రాజ్‌భవన్‌ని ముట్టడించిన రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
దీనిపై సోమవారం సుప్రీం విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పిటిషన్ ఉపసంహరణకు డిసైడ్ అయ్యింది. అయితే ఈ విషయంపై దీనిపై పార్టీలో చర్చ వచ్చినప్పుడు.. నాయకులు రెండుగా చీలిపోయినట్లు తెలిసింది. వారిలో కొందరు న్యాయపోరాటమే మంచిదని అభిప్రాయపడగా.. సింహభాగం నాయకులు కేసును ఉపసంహరించుకుని, రాజకీయంగా ఎదుర్కోవడమే సరైన నిర్ణయమని తేల్చిచెప్పారు.
మరోవైపు... ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని తప్పుబడుతూ బీజేపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకు తోడు.. అసెంబ్లీని సమావేశపరచాల్సిందిగా సీఎం గెహ్లాట్ గవర్నర్‌కు లేఖ రాసిన నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. ఒకవేళ ఫ్లోర్‌టెస్ట్ అనివార్యమైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా తమ పార్టీ నుంచి గెలుపొందిన ఆరుగురు ఎమ్మెల్యేలకు ఆదివారం విప్ జారీ చేయడంతో రాజస్తాన్ రాజకీయం రసకందాయకంలో పడింది.
కాగా బీఎస్పీ ఎమ్మెల్యేలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఈ విషయంపై మాయావతి కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించగా.. ఇది స్పీకర్ పరిధిలోని అంశమని.. తాము జోక్యం చేసుకోలేమని ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో బీఎస్పీ జారీ చేసిన విప్ జారీ చేయడం గమనార్హం.