Assembly Elections 2021- Representational Image | (Photo-PTI)

Kolkata. April 5: దేశంలో అయిదు రాష్ట్రాల్లో మినీ ఎన్నికల సమరం ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ (Assembly Elections 2021) ప్రారంభమైంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో మంగళవారం ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాంలో మూడో విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. చివరి గంటలో ఓటు వేసేందుకు కరోనా బాధితులను అనుమతిస్తారు. వీరి కోసం ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో మూడో దశలో 31 స్థానాల్లో ఎన్నికలు (West Bengal Assembly Elections 2021) జరుగుతున్నాయి.78.5 లక్షల మంది ఓటు వేయనున్నారు. 31 స్థానాల్లో 205 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్‌ జరుగనుండడంతో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

తమిళనాడు 234, కేరళ 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ (Tamil Nadu Assembly Elections 2021) జరుగుతోంది. అసోంలో తుది విడత పోలింగ్‌లో భాగంగా 12 జిల్లాల్లోని 40 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.‌ మే 2న బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడించన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 వేల ప్రాంతాల్లో 88,937 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 10,528 పోలింగ్‌ కేంద్రా లు సమస్యాత్మకమైనవిగా, 300 పోలింగ్‌ కేంద్రాలు అల్ల ర్లు, ఘర్షణలు జరిగేందుకు అవకాశమున్న అత్యంత సమ స్మాత్మకమైనవిగా గుర్తించి అధికారులు అదనపు భద్రతను కల్పి స్తున్నారు.

చెన్నైలో ని 16 శాసనసభ నియోజకవర్గాలకు గాను 6,123 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, రాష్ట్ర ఎన్నికల కార్యాలయానికి అనుసంధానించారు. ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ..ఎక్కడ ఏం జరిగినా తక్షణం తెలిసేలా ఏర్పాట్లు చేపట్టారు. ఈ కేంద్రాన్ని ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రసాద సాహు సోమవారం పరిశీలించారు.

మోదీ-అమిత్ షాల మేజిక్‌ పనిచేస్తుందా, తమిళనాడులో గెలిచేదెవరు, కేరళను ఏలేదెవరు, అస్సాంలో ఆఖరి దశ పోలింగ్, దేశాన్ని ఆకర్షిస్తున్న పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వంలో భాగంగా మంగళవారం మక్కల్ నీధి మయ్యాం అధినేత, ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ తన కుమార్తెలతో కలిసి చెన్నైలోని తైనంపేట హైస్కూల్ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. కమల్ హాసన్ ముఖానికి మాస్కు ధరించి తన కుమార్తెలతో కలిసి వచ్చి క్యూలో వేచి ఉండి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని స్టెల్లామేరీస్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన సినీనటుడు రజనీకాంత్ ఓటేశారు.

చెన్నైలోని తేనాంపేట్‌లో డీఎంకే అధినేత స్టాలిన్‌, ఆయన తనయుడు ఉదయనిధి ఓటు హక్కు వినయోగించుకున్నారు. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో బారులు తీరారు.కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నేత చిదంబం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా సినీ నటుడు సూర్య, ఆయన తమ్ముడు నటుడు కార్తీ ఓటు వేశారు.

భారత్‌లో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉగ్రరూపం, తొలిసారిగా లక్ష దాటిన కరోనా కేసులు, పలు రాష్ట్రాల్లో మినీ లాక్‌‌డౌన్‌ అమల్లోకి, అయిదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ప్రధాని మోదీ

కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2.74 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. 957 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.అస్సాంలో మూడో దశలో(చివరి దశ) 40 స్థానాలకు ఎన్నికలు (Kerala assembly Elections 2021) జరుగుతున్నాయి. 337 మంది అభ్యర్థుల జాతకాన్ని ఓటర్లు నిర్దేశించబోతున్నారు. చివరి దశ ఎన్నికల్లో 25 మంది మహిళా అభ్యర్థులు సైతం పోటీ పడుతున్నారు. 11,401 పోలింగ్‌ కేంద్రాల్లో 79.19 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది.

కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి తరలివస్తున్నారు. కేరళలోని పాలక్కాడ్‌లో బీజేపీ అభ్యర్ధి శ్రీధరన్ఓటు వేశారు

అసోంలోని గువాహటీలో గల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఈ రోజు అసోంలో జరుగుతున్న మూడవ దశ ఎన్నికలలో అసోం ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ నేత హిమంత్ బిశ్వాతో పాటు 337 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక బెంగాల్ విషయానికొస్తే బీజేపీ నేత స్వప్ప దాస్ గుప్తా, టీఎంసీ నేత ఆషిమా పాత్ర, సీపీఎం నేత కాంతి గంగూలీ ఎన్నికల్ బరిలో ఉన్నారు.

పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Puducherry Assembly Elections 2021) కొనసాగుతోంది. ఓట్లర్లు పెద్ద సంఖ్యలో పోలిం‍గ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. యానాం అసెంబ్లీ స్థానంలో పోలింగ్‌ కొనసాగుతోంది.‌ మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు యానాంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.