Newdelhi, Sep 21: ఆప్ (AAP) నేత ఆతిశీ (Delhi CM Atishi) ఢిల్లీ ఎనిమిదో సీఎంగా శనివారం సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా.. ఆతిశీ చేత ప్రమాణం చేయించనున్నారు. ప్రస్తుతం దేశంలో మమతా బెనర్జీ ఒక్కరే మహిళా సీఎం కాగా, రెండో సీఎంగా ఆతిశీ నిలవనున్నారు. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న అతి పిన్న వయస్కురాలు (43)గా కూడా ఆతిశీ నిలవనున్నారు. కాంగ్రెస్‌కు చెందిన షీలాదీక్షిత్, బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్ తరువాత ఢిల్లీకి మూడో మహిళా సీఎంగా ఆతిశీ బాధ్యతలు చేపట్టనున్నారు.
Atishi to take oath as Delhi chief minister at Raj Niwas today @kaidensharmaa shares details @SakshiLitoriya_ | #Atishi #Delhi #AtishiMarlena pic.twitter.com/OhHjfeCDj9
— News18 (@CNNnews18) September 21, 2024
అలా సీఎంగా..
ఢిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ఇటీవల బెయిల్ పై విడుదలైన సందర్భంగా సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ప్రజలు తాను నిజాయితీపరుడినని సర్టిఫికెట్ ఇచ్చేవరకూ సీఎం పదవిని చేపట్టబోనని ఆయన ప్రతినబూనారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ స్థానంలో ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ఆతిశీని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది.