Didi on Modi: ఫస్ట్ మాకు రావాల్సిన వాటా ఇవ్వండి! మోదీకి దీదీ కౌంటర్, చమురుపై 25 శాతం ఎక్కువ పన్ను మీరే వేస్తున్నారు, లెక్కలతో సహా ప్రధానికి ఘాటు సమాధానమిచ్చిన మమతా బెనర్జీ
Mamata Banerjee. (Photo Credits: Twitter)

Kolkata, April 27: దేశంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు..పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ సుంకాన్ని తగ్గించి ప్రజలపై భారం లేకుండా చూడాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు పై బుధవారం పలువురు సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ..ఈ సందర్భంగా వ్యాట్ సుంకం అంశాన్ని లేవనెత్తారు. ప్రధానంగా మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ (West Bengal), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ(Telangana), తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పెట్రోల్ (Petrol), డీజిల్ పై వ్యాట్ ఎక్కువగా ఉంటోందని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కొంత వ్యాట్ ను తగ్గించి ప్రజలపై పెట్రో భారం లేకుండా చూడాలంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. అయితే ప్రత్యేకించి బీజేపీయేతర రాష్ట్రాల పేర్లనే ప్రధాని మోదీ ప్రస్తావించడంపై ఆయా రాష్ట్రాల సీఎంలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'Politics of Hate': మత విద్వేష రాజకీయాలు వెంటనే ఆపండి, మైనారిటీలను నిత్యం భయాందోళనకు గురిచేస్తున్నారంటూ.. ప్రధాని మోదీకి లేఖ రాసిన 100 మందికి పైగా మాజీ బ్యూరోక్రాట్లు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddav Thackeray)ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించగా..పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamatha Benarjee) సైతం మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్‌, గృహోపకరణాల ధరల పెరుగుదల విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకు వదిలేసిందని, రాష్ట్రాలు ధరలు తగ్గించాల్సి ఉంటుందని (Reduce Price) ప్రధాని చెప్పడం విడ్డురంగా ఉందని, ధరలు పెంచింది కేంద్రం మరి రాష్ట్రాలు రాష్ట్రాలు ఎలా తగ్గిస్తాయి? అంటూ మమతా బెనర్జీ దుయ్యబట్టారు. “మీరు మీ ఆదాయాన్ని చూశారా? ప్రజలతో ఏకపక్ష విషయాలు చెప్పి తప్పుదారి పట్టిస్తున్నారు!” అంటూ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

“మీరు 5 బీజేపీ పాలిత రాష్ట్రాలను మెచ్చుకున్నారు ఇంకా వారికి చాలా డబ్బు(కేంద్రం నుంచి) ఇస్తున్నారు. వారికి చాలా పథకాలకు మా కంటే ఎక్కువ డబ్బు ఇస్తారు. మీరు వారికి 50% ఎక్కువ ఇస్తారు. కాబట్టి, రూ. 4,000 కోట్లు-5,000 కోట్లు వారు వదులుకోవడం పెద్ద విషయం కాదు. కేంద్రం నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాలకు రూ. 40,000 కోట్లు ఇస్తున్నారు ” అంటూ సీఎం మమతా బెనర్జీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. గత మూడేళ్లుగా బెంగాల్‌లో పెట్రోల్‌పై రూ.1 సబ్సిడీ ఉన్నందున తమ ప్రభుత్వానికి రూ.1500 కోట్ల నష్టం వాటిల్లిందని మమత అన్నారు.

TRS Plenary Meeting 2022: మోదీని టార్గెట్ చేసిన కేసీఆర్, పుల్వామా, స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్, క‌శ్మీర్ ఫైల్స్ అంటూ విద్వేషాల‌ను రెచ్చ‌గొడుతున్నారని మండిపాటు, దేశానికి ప్ర‌త్యామ్నాయ ఎజెండా కావాలని సూచన

“నా రాష్ట్రానికి సంబంధించినంత వరకు, నేను గత 3 సంవత్సరాలుగా పెట్రోల్‌పై రూ. 1 సబ్సిడీ ఇస్తున్నా, మా ప్రభుత్వానికి రూ. 1.5 వేల కోట్లు నష్టం వాటిల్లిందని మీరు తెలుసుకోవాలి. దానిపై మీరు ఏమీ చెప్పలేదు. కేంద్రం నుంచి మాకు రూ. 97,000 కోట్లు రావాల్సి ఉంది. ప్రస్తుతం పెట్రోల్‌పై బెంగాల్ ప్రభుత్వంతో పోలిస్తే కేంద్రం విధించే పన్ను (25%) ఎక్కువ” అని ఆమె చెప్పారు. కేంద్రం, రాష్ట్రాలకు సరిసమానంగా 50 శాతం పన్ను రాబడి ఉండాలని మేము చెబుతున్నామని, కానీ అందుకు అంగీకరించని కేంద్రం 75 శాతం వసూలు చేస్తుందని సీఎం మమతా అన్నారు. “మరి 25 శాతం పన్ను అందులో సబ్సిడీ ద్వారా రాష్ట్రాలు ఎలా నడుస్తాయి? రాష్ట్రాలపై భారం పడకుండా చూడాలని ప్రధానికి చెప్పాలనుకుంటున్నాను, ఆయన అన్ని విషయాలను గమనించాలి” అని సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి సూచించారు.