Siddaramaiah, other Congress leaders detained by Karnataka police (Photo Credits: ANI)

Bengaluru, February 15: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీదర్ దేశద్రోహ కేసు (Bidar School Sedition Case) ఆరోపణలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టడానికి ప్రయత్నించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు పలువురు పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్దరామయ్య తోపాటు కర్ణాటక కాంగ్రెస్ నాయకులు దినేష్ గుండు రావు, రిజ్వాన్ అర్షద్, కె సురేష్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ఆందోళన చేసేందుకు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసుల తీరుపై సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.. "రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు.

కర్ణాటకలో విరబూసిన కమలం

పోలీస్‌ వ్యవస్థను యడియూరప్ప సర్కారు దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్‌ నాయకులు ఈ సందర్భంగా విమర్శించారు. కర్ణాటకను పోలీస్‌ రాష్ట్రంగా మార్చిందని దుయ్యబట్టారు.

Here's ANI Tweet

బీదర్ లోని షాహీన్ ప్రైమరీ  పాఠశాలలో పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా జనవరి 30 న నిరసన నాటకం ప్రదర్శించారు. దాంతో పాఠశాల హెడ్ ఫరీదా బేగం తోపాటు ఓ విద్యార్థిని తల్లి నజ్బున్నిసా అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వారిపై దేశద్రోహం ఆరోపణలు నమోదయ్యాయి. శుక్రవారం జిల్లా జైలులో ఉన్న ఈ ఇద్దరు మహిళలను కలుసుకుని వారితో సిద్దరామయ్య చర్చలు జరిపారు .

ఏపీ టూరిజం బస్సుపై రాళ్ల దాడి

కర్ణాటక పోలీసుల చర్యను ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు తీవ్రంగా ఖండించారు. సీఎం యడియూరప్ప (CM BS Yediyurappa) విచక్షణ కోల్పోయినట్టుగా కన్పిస్తున్నారని సిద్ధరామయ్య తన ట్విటర్‌లో విమర్శించారు. వందేళ్ల క్రితం చేసిన అరాచక ఐపీసీ చట్టాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరముందని ట్వీట్‌ చేశారు