Congress leader Siddaramaiah | File Image | (Photo Credits: PTI)

Bengaluru, December 9: కర్ణాటకలో రాజకీయ వేడి మొదలైంది. కర్ణాటకలో ఇటీవల 15 అసెంబ్లీ స్థానాలకు(15 Assembly constituencies) జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress),జేడీఎస్(JDS) పార్టీలకు ఓటర్లకు భారీగా షాక్ ఇచ్చారు. ఇవాళ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ(BJP) దూకుడును చూసి కాంగ్రెస్,జేడీఎస్ కార్యకర్తలు నాయకులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 15 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. స్వతంత్ర అభ్యర్థి ఓ చోట గెలిచారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత పదవికి మాజీ సీఎం సిద్దరామయ్య రాజీనామా(Siddaramaiah Resigns) చేశారు. ప్రజల తీర్పుని తాము గౌరవిస్తున్నట్లు ఆయన తెలిపారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకీ పంపించినట్లు ఆయన తెలిపారు. విజయం కోసం తీవ్రంగా కృషి చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవం పట్ల తాను నిజాయితీతో పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నట్లు రాజీనామా లేఖలో సిద్దరామయ్య తెలిపారు.

Siddaramaiah Resigns

ఈ సమయంలో సీఎల్పీ లీడర్ గా దిగిపోవడం తన నైతిక బాధ్యత అని ఆ లేఖలో ఆయన తెలిపారు. మరోవైపు కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండురావ్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.

దినేష్ గుండురావ్ రాజీనామా

కర్ణాటకలో యడ్ఢ్యూరప్ప(B.S. Yediyurappa ) సారథ్యంలోని బీజేపీ సర్కార్ మనుగడను నిర్ణయించే అత్యంత కీలకమైన ఎన్నికలు కావడం వల్ల అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాలను నిలుపుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమైందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Former Chief Minister Siddaramaiah) కాంగ్రెస్ సీఎల్పీ పదవికి రాజీనామా చేశారు.

ఇదిలా ఉంటే కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో(Karnataka bypolls 2019) ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల సంతోషంగా ఉన్నానని సీఎం బీఎస్‌ యడ్డ్యూరప్ప హర్షం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంతో ఇప్పుడు తమకు ఎలాంటి సమస్యలూ లేవనీ, ఇక ప్రజా అనుకూల, సుస్ధిర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తామని స్పష్టం చేశారు.

BS Yediyurappa

ఉప ఎన్నికల్లో కాషాయ ప్రభంజనంతో కన్నడ రాజకీయాల్లో ఏర్పడిన సంక్షోభం సమసిపోయినట్టయింది. అసెంబ్లీలో ప్రస్తుతం మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న ముఖ్యమంత్రి యడ్డ్యూరప్ప సర్కార్‌కు ఉప ఎన్నికల ఫలితాలు మంచి జోష్‌ను నింపాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.