Bypoll Results 2019: Bypolls for 51 assembly, 2 Lok Sabha seats: List of winners report

Mumbai, October 24: అక్టోబర్ 21న మహారాష్ట్ర, హర్యానాలతో పాటు దేశ వ్యాప్తంగా మొత్తం 51 అసెంబ్లీ నియోజక వర్గాలకు అలాగే 2 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. కాగా ఈ రోజు వీటికి సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. రెండు ప్రధాన రాష్ట్రాల్లో జరిగిన మెయిన్ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ, హర్యానాలో మూడో పార్టీతో కలిసి ఏదైనా పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. అయితే ఉప ఎన్నికలు జరిగిన 51 స్థానాల సరళిని చూస్తే యూపీలోనే 11 స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అక్కడ బీజేపీ వ్యూహం బెడిసికొట్టింది. కేవలం ఆరుస్థానాలకు మాత్రమే పరిమైతనట్లుగా తెలుస్తోంది.

మిగతా చోట్ల ఎక్కువ భాగం అధికారంలో ఉన్న పార్టీలే గెలిచాయి. తెలంగాణాలోని హుజూర్ నగర్ లో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది. ఓ సారి మొత్తం స్థానాలను పరిశీలిస్తే..

ఉత్తరప్రదేశ్

ఉత్తర్‌ ప్రదేశ్‌లో జరిగిన 11 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో పాలక బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ ఆరు స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా విపక్ష ఎస్పీ రెండు స్ధానాల్లో బీఎస్పీ, కాంగ్రెస్‌లు ఒక్కో స్ధానంలో ముందంజలో ఉన్నాయి. కాగా ఉప ఎన్నికలు జరిగిన 11 స్ధానాల్లో ఎనిమిది స్ధానాలు బీజేపీ ప్రాతినిథ్యం వహిస్తున్నవే కావడం గమనార్హం. ఎస్పీ, బీఎస్పీలు చెరోస్ధానంలో ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. ఎస్పీ రాంపూర్‌ స్ధానాన్ని, బీఎస్పీ జబల్‌పూర్‌ స్ధానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతిష్టాత్మకంగా పోరాడుతున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 300కిపైగా స్ధానాలతో క్లీన్‌స్వీప్‌ చేసిన బీజేపీ ఈనెల 21న జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మొత్తం 11 స్ధానాలను గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేసింది. 11 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు బీజేపీ 10 స్ధానాల్లో పోటీచేయగా, ఒక స్ధానం​ మిత్రపక్షం అప్నాదళ్‌కు కేటాయించింది.

తెలంగాణా

తెలంగాణలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి (Huzur Nagar Constituency) జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ (TRS Party) అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ((Sanampudi Saidireddy), తన సమీప అభ్యర్థి పద్మారెడ్డి (కాంగ్రెస్) పై 43, 624 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.  హూజూర్ నగర్‌లో టీఆర్ఎస్ ఘన విజయం

పంజాబ్

పంజాబ్‌లో జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మూడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఒక స్థానంలో బీజేపీ, అకాలీదళ్ శిరోమణి అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. జలాలాబాద్, ఫగ్వారా, ముకేరియన్ నియోజవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండగా... ఢాకాలో ఎస్ఏడీ ముందంజలో ఉంది.

బీహార్

బీహార్‌లో రాష్ట్రంలో ఎంఐఎం బోణి కొట్టింది. కిషన్‌గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన​ ఉప ఎన్నికలో మజ్లిస్‌ విజయం సాధించింది.మొత్తం ఐదు స్థానాల్లో రెండు చోట్ల జేడీయూ అభ్యర్థులు ఆధిక్యంలో ఉండగా.. ఆర్జేడీ, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కోచోట ముందంజలో ఉన్నారు.

గుజరాత్

గుజరాత్‌లో మొత్తం ఆరుస్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. థరడ్, ఖేరలు, అమ్రైవాడీ, లునావాడా, రాధాన్‌పూర్, బయద్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇక ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకొన్నట్టు కనిపిస్తున్నది. ఈ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతున్నది. రాధాన్‌పూర్, బయద్, అమ్రైవాది, లునావాదా స్థానాల్లో కాంగ్రెస్ అధిక్యంలో ఉంది.

కేరళ

ఈ ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న సీపీఎం రెండు, కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల విజయం సాధించగా.. ముస్లిం లీగ్ పార్టీ ఒకచోట విజయం సాధించింది. మంజేశ్వర్, ఎర్నాకులం, ఆర్నూర్, కొన్ని, వట్టి యార్కప్ నియోజక వర్గాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో మజేశ్వర్ లో ముస్లిం లీగ్ పార్టీ విజయం సాధించగా, ఎర్నాకులం, ఆర్నూర్ నియోజక వర్గాల్లో సీపీఎం, కొన్ని, వట్టి యార్కప్ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

తమిళనాడు

తమిళనాడులో జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో అన్నా డీఎంకే సత్తాచాటింది. రాష్ట్రంలోని 2 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో నిలిచారు. నన్గునేరి, విక్రవన్డీ నియోజవర్గాల్లో డీఎంకే అభ్యర్థులపై అన్నా డీఎంకే అభ్యర్థులు మెజార్టీ సాధించారు.

సిక్కిం

సిక్కీంలో 3 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ-సిక్కీం క్రాంతికారీ మోర్చా కూటమి 3 స్థానాలను గెలుచుకుంది. సిక్కిం ముఖ్యమంత్రి SKM అభ్యర్థి గోలాయ్ Poklok Kamrang నియోజక వర్గం నుంచి 41 ఓట్ల శాతంతో గెలిచారు. గొలాయ్ కి మొత్తం 10,585 ఓట్లు పోలవగా అతని ప్రత్యర్థి Sikkim Democratic Front (SDF) అభ్యర్థి rival Moses Raiకి 1858 ఓట్లు పోలయ్యాయి.

రాజస్థాన్

రాజస్థాన్ లో రెండు సీట్లకు ఉపఎన్నికలు జరిగాయి అందులో కాంగ్రెస్ 1 నాన్ బీజేపీ 1సీటును గెలుచుకున్నాయి. ఒరిస్సాలో 1సీటును బీజేడీ, చత్తీస్ ఘడ్ లో 1 సీటును కాంగ్రెస్, అరుణాచల ప్రదేశ్ లో స్వతంత్రులు గెలిచారు. అలాగే హిమాచల ప్రదేశ్ లో రెండు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. మేఘాలయలో United Democratic Party (UDP) పార్టీ గెలిచింది.

లోక్‌సభ

రెండు నియోజకవర్గాల్లో లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో బీహర్ Samastipur నుంచి Lok Janshakti Party’s (LJPs) పార్టీ విజయకేతనం ఎగురవేసింది. సమీప ప్రత్యర్థి Congress’ Ashok Kumarపై ఎల్ జేపీ అభ్యర్థి రాజ్ లక్ష ఓట్ల తేడాతో గెలిచారు. మహారాష్ట్రలో సతారా నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో ఎన్సీపీ వైపు ఓట్లరు మొగ్గు చూపారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఎన్సీపీని వీడి బీజేపీలో చేరిన ఉదయన్‌రాజే భోసలేకి ఓటర్లు అక్కడ భారీ షాక్ ఇచ్చారు. మూడు సార్లు వరుసగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చిన ఆయన ఈసారి ఓటమి అంచుల్లో కూరుకుపోయారు. ఎన్సీపీ అభ్యర్థి శ్రీనివాస్ పాటిల్‌పై 82 వేల ఓట్ల మేర వెనుకంజలో ఉన్నారు.