Chennai,Febuary 15: తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర రాజధాని చెన్నైలో (Chennai) ఎన్నార్సీ, సీఏఏకు (NRC,CAA) వ్యతిరేకంగా నిరసనలు భగ్గుమంటున్నాయి. వీటిని ఉపసహంరించుకోవాలని అక్కడ ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. అక్కడ ఎన్‌ఆర్సీ మంటలు ఇంకా చల్లారక పోవడంతో ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి.
దేశంలో అక్రమ వలసదారులను ఏరివేస్తాం
తాజాగా ఎన్‌ఆర్సీని వ్యతిరేకిస్తూ చెన్నైలో ఓ వర్గం ప్రజలు అర్ధరాత్రి చేపట్టిన నిరసన (Anti-CAA, NRC protestors) ఉద్రిక్తత రేపింది. వన్నార్‌పేట, అలందూర్ మెట్రో రైల్వే సమీపంలో వారు ఆందోళనకు దిగడంతో... పోలీసులు అడ్డుకున్నారు.
అమిత్ షా.. బలవంతంగా హిందీని మాపై రుద్దవద్దు!
దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలీసులు జరిపిన లాఠీ చార్జీకి (Lathicharge) నిరసనగా ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోయారు. ఖాకీలపై రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో అసిస్టెంట్ కమిషనర్ విజయకుమారితోపాటు కొందరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
కాగా పోలీసుల లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఓ వర్గం ప్రజల ఆందోళనలతో చెన్నై అట్టుడుకుతోంది. కోయంబత్తూరు, పొలాచ్చి, నాగర్‌కోయిల్, ఊటీ జిల్లాల్లోను నిరసనకారులు ఆందోళనకు దిగారు. మరోవైపు...డీఎంకే నేత స్టాలిన్ కూడా పోలీసుల తీరును ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపున్న వారిని అరెస్ట్ చేశారని.. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Here's Anti-CAA, NRC protestors Video
Chennai Police Brutality at the anti CAA Protest site few moments ago.
— CAA / NRC Protest Info. (@NrcProtest) February 14, 2020
నిన్న 5వేలకు మందికి పైగా పాల్గొన్న CAA వ్యతిరేక ఆందోళనలో 170మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన చెన్నైలోని ఓల్డ్ వాషర్‌మెంట్‌పేట్‌లో జరిగింది. మింట్ బ్రిడ్జ్‌కు వెళ్లేదారిలోని వీధులన్నీ బ్లాక్ చేసి నిరసనకారులు ఆందోళన చేపట్టారు. వెయ్యి మందికి పైగా పోలీసులు వచ్చినప్పటికీ వారిని అదుపు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలోనే పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేశారు . 'మధ్యాహ్నం 2నుంచి 5గంటల సమయం మధ్యలో మూడు సార్లు లాఠీ ఛార్జి చేసి చెదరగొట్టారు.
Here's Anti-CAA, NRC protestors Tweet
*Students have been detained from Tamilanadu Bhawan while protesting against Tamilanadu police brutality in Chennai last night..*
Being taking to some unknown location..
Message from Meeran Haider#TamilNaduAgainstCAA_NRC_NPR #TamilNadu pic.twitter.com/GDB0Chmede
— Asad Ashraf (@Asad_Ashraf88) February 15, 2020
గాయాలు ఎక్కువ అయిన వారిని స్టాన్లీ గవర్నమెంట్ హాస్పిటల్‌కు, కొందరిని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేర్పించారు. సిటీలోని అలందర్, అన్నా సాలైలతో పాటు తమిళనాడు వ్యాప్తంగా మధురై, కొయంబత్తూరు ప్రాంతాలలో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. ఈ బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
మరిన్ని ఆందోళనలు జరుగుతాయనే ఉద్దేశ్యంతో తమిళనాడు సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 41ను ఫిబ్రవరి 13 నుంచి 22వరకూ అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిని బట్టి ఆందోళనకారులు ఒక చోటుకు చేరితే హెచ్చరికలు జారీ చేయకుండానే వారిని చెదరగొడతారు.