Delhi, Feb 5: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 70 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్(Congress) మధ్య త్రిముఖ పోరు నెలకొంది.
ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది(Delhi elections 2025). ఆరు గంటల లోపు క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. ఢిల్లీలో మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు ఉండగా వీరిలో 83.76 లక్షల మంది పురుషులు, 72.36 లక్షల మంది మహిళలు మరియు 1,267 థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు, లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ
మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా 27 ఏళ్లుగా ఢిల్లీలో అధికారం చేజిక్కించుకోలేని బీజేపీ ఈ సారి ఎలాగైన గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. 15 ఏళ్ల పాటు ఢిల్లీ పీఠాన్ని పాలించిన కాంగ్రెస్ సైతం తనవంతు ప్రయత్నాలను చేయగా ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపుతారో వేచిచూడాలి.
న్యూఢిల్లీ నుండి ఆప్ నేత , మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాల్కాజీ నియోజకవర్గం నుండి సీఎం అతిషి, జంగ్‌పురా నియోజకవర్గం నుండి మానీష్ సిసోడియా, షకూర్ బస్తీ నియోజకవర్గం నుండి సత్యేంద్ర జైన్ బరిలో నిలిచారు. 2020, 2015 ఎన్నికలల్లో ఆప్ విజయం సాధించగా 1998 లో చివరిసారిగా BJP సీఎం అధికారంలో ఉన్నారు.