File Image of PCC Chief Uttam Kumar Reddy | TRS Party Flag| Nereducharla Municipality, Representational Image

Hyderabad, January 28:  నేరేడుచర్ల (Nereducharla) చైర్మన్ పీఠంపై టీఆర్ఎస్ (TRS) పార్టీ తన పంతం నెగ్గించుకుంది. కాంగ్రెస్ పార్టీతో ఉత్కంఠంగా సాగిన పోరులో ఒక్క ఓటు తేడాతో నేరేడుచర్ల మున్సిపల్ పీఠాన్ని సైతం టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.  చైర్మన్‌గా చందమల్ల జయబాబు (Municipal Chairman) , వైస్ చైర్మన్‌గా చల్లా శ్రీలత ఎన్నికయ్యారు.

అంతకుముందు సూర్యపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో చైర్మన్, వైఎస్ చైర్మన్‌ల ఎన్నికపై నాటకీయ పరిణామాలు ఓటు చేసుకున్నాయి. ఎక్ అఫిషియో సభ్యుల నమోదు, ఓటింగ్ విషయంలో గందరగోళం తలెత్తడంతో సూర్యాపేట జిల్లా కలెక్టర్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం బదిలీ వేటుకు సిఫారసు చేసింది. నేరేడుచర్ల మునిసిపాలిటీలోని మొత్తం 15 వార్డులుండగా టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 7 వార్డులు గెలిచాయి. ఒక వార్డులో సీపీఎం అభ్యర్థి గెలిచారు. దీంతో కాంగ్రెస్, సీపీఎం కలిసి చైర్మన్ పీఠం కోసం పావులు కలుపగా, టీఆర్ఎస్ పార్టీ ఎక్స్ అఫీషియో మెంబర్లను రంగంలోకి దించింది. ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి, రాజ్యసభ ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు కలిసి టీఆర్ఎస్ బలం 10 కి చేరింది.

ఇటు కాంగ్రెస్ కూడా నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తో పాటు రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచందర్ రావు (KVP Ramachandra Rao) ఓట్లతో తమ సంఖ్యను 10కి పెంచుకుంది.

అయితే కేవీపీకి ఓటు హక్కు ఇవ్వడం పట్ల టీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించే కేవీపీ రామచంద్ర రావును తెలంగాణలో జరిగే ఎన్నికలకు ఎలా అనుమతిస్తారంటూ నిలదీసింది. దీంతో సోమవారం జరగాల్సిన నేరేడు చర్ల చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది.

ఈ పరిణామాలను గమనించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవీపీను ఓటింగ్‌కు అనుమతించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్‌పై బదిలీ వేటు వేసింది. అలాగే ఎన్నికల నిర్వహణ అధికారిగా ఉన్న ఎంపీడీఓను ఈసీ సస్పెండ్ చేసింది.

అయితే టీఆర్ఎస్- కాంగ్రెస్‌కు సమాన బలాలు ఉండటంతో లాటరీ పద్ధతిలో చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక ఉంటుంది అని భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ టీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డిని ఎక్స్ అఫీషియో సభ్యునిగా రంగంలోకి దించి తమ బలాన్ని 11కు పెంచుకుంది. ఆయన పేరును జాబితాలో కనిపించకుండా అధికార పార్టీ గోప్యంగా ఉంది. ఈ ఊహించని పరిణామంతో ఖంగుతిన్న కాంగ్రెస్ పార్టీ చివరికు నేరేడుచర్ల మున్సిపాలిటీని కోల్పోవాల్సి వచ్చింది. అధికార పార్టీ టీఆర్ఎస్ అక్రమంగా ఈ ఎన్నికల్లో గెలిచిందని ఆరోపిస్తూ చైర్మన్ ఎన్నికను కాంగ్రెస్  బహిష్కరించింది. ప్రమాణ స్వీకారం చేయకుండానే కాంగ్రెస్ సభ్యులు బయటకు వచ్చేశారు.  కాంగ్రెస్ ఘోర పరాజయం, కరీంనగర్ లో టీఆర్ఎస్ ఘన విజయం

సోమవారం ఇచ్చిన జాబితా ప్రకారమే ఎన్నిక జరపాలంటూ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ కేవీపీ ఆందోళనకు దిగారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.