Coronavirus Screening | (Photo Credits: AFP)

New Delhi, January 6: దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,088 కరోనా కేసులు (Covid in India) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం పేర్కొంది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,03,74,932కు (Coronavirus in India) చేరాయి. కొత్తగా 21,314 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 99,97,272 మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది. మరో 264 మంది మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,50,114కు పెరిగింది.

ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 2,27,546 ఉన్నాయని ఆరోగ్యమంత్రిత్వశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. మంగళవారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 9,31,408 శాంపిల్స్‌ టెస్ట్‌ చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 17,74,63,405 టెస్టులు నిర్వహించినట్లు వివరించింది.

దేశంలో యూకే కరోనా కొత్త స్ట్రెయిన్‌ కేసులు (UK Coronavirus Strain) 71కి చేరాయి. మంగళవారం ఉదయం వరకు సంఖ్య 58 ఉండగా.. సాయంత్రానికి మరో 13 మందికి నిర్ధారణ అయింది. కొత్త స్ట్రెయిన్‌ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. తమిళనాడులో కొత్తగా మరో ముగ్గురికి ఈ బ్రిటన్‌ వైరస్‌ సోకింది. దీంతో రాష్ట్ర రాజధాని చెన్నైలో కొత్త తరహా కరోనా బారినపడినవారి సంఖ్య నాలుగుకు చేరింది. చెన్నైలో బ్రిటన్‌ నుంచి వచ్చిన మరో ముగ్గురికి యూకే కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిందని ఆరోగ్య శాఖ కార్యదర్శి డా. రాధాకృష్ణ తెలిపారు.

రూ.20 వేల కోట్లతో..ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవనం దాకా, సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌, కేంద్ర ప్రభుత్వ సచివాలయానికి అనుమతి

వారందరిని నగరంలోని కింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.బ్రిటన్‌ నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో ఇప్పటివరకు 44 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. మరో 12 మంది నమూనాలను పుణె వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించామని వెల్లడించారు. వారికి సంబంధించిన ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

ముంచుకొస్తున్న బర్డ్ ఫ్లూ వైరస్ ముప్పు, నాలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్, నాన్ వెజ్ అమ్మకాలు, ఎగుమతులపై హిమాచల్ ప్రదేశ్‌లో నిషేధం, ఇన్‌ఫెక్షన్‌తో వేల సంఖ్యలో పక్షులు మృతి

అత్యవసర, పరిమిత వినియోగానికి అనుమతిచ్చిన కొవిడ్‌-19 టీకాల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిషేధం విధించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ ఎగుమతులపై నిషేధం ఉందంటూ వస్తున్న తప్పుడు సమాచారం వ్యాపించకుండా అడ్డుకోవాలని మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు. భారత్‌ బయోటెక్‌, సీరం సంస్థ మంగళవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలోని అంశాల గురించి కూడా రాజేశ్‌ ప్రస్తావించారు. మరోవైపు.. భారత్‌లో ఉత్పత్తికానున్న ఆక్స్‌ఫర్డ్‌ (కొవిషీల్డ్‌) టీకాను సత్వరం దిగుమతి చేసుకునేందుకు బ్రెజిల్‌ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందుకోసం తమ దౌత్య అధికారులను రంగంలోకి దింపింది.