Supreme Court of India |(Photo Credits: IANS)

New Delhi, January 5: ఢిల్లీలో ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవనం వరకు మ‌రింత‌ అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా రూ. 20,000 కోట్లతో త‌ల‌పెట్టిన సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టుకు (Central Vista Project) సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా పార్లమెంట్‌ నూతన భవనంతో (New Parliament) పాటు, కేంద్ర ప్రభుత్వ సచివాలయం వంటివి నిర్మించనున్నారు. పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్‌పై కేంద్రం వాదనలతో జస్టిస్‌ ఎ.ఎం. ఖన్విల్కర్‌ ధర్మాసనం ఏకీభవించింది.

నిర్మాణ పనుల ప్రారంభానికి హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతి తప్పనిసరని మంగళవారంనాడు ఇచ్చిన సంచలన తీర్పులో సుప్రీం ధర్మాసనం (Supreme Court) స్పష్టం చేసింది. కమిటీ నుంచి ప్రాజెక్టు ప్రపొనెంట్లు తప్పనిసరిగా ఆమోదం పొందాల్సి ఉంటుందని ఆదేశాలిచ్చింది. న్యాయమూర్తులు ఏఎం ఖాన్‌విల్కర్, దినేశ్ మహేశ్వరి, సంజీవ్ కన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తీర్పు వెలువరించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం గత ఏడాది 5న తీర్పును రిజర్వ్ చేసి మంగళవారంనాడు తీర్పును వెలువరించింది.

కార్పోరేట్ వ్యవసాయంపై ముఖేష్ అంబానీ రిల్ కీలక ప్రకటన, కాంట్రాక్ట్ వ్యవసాయంలోకి రిలయన్స్ ప్రవేశించదని వెల్లడి, జియో మొబైల్ టవర్ల విధ్వంసాన్ని ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్

డీడీఏ చట్టం కింద అధికారాల వినియోగం చెల్లుబాటవుతుందని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. అలాగే పర్యావరణ అనుమతి సిఫారసులు సరిగానే ఉన్నందున వాటి చెల్లుబాటును ధ్రువీకరిస్తున్నట్టు స్పష్టం చేసింది. దీంతో నూతన పార్లమెంట్ భవన నిర్మాణం, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం, ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న 3 కిలోమీటర్ల రాజ్‌పథ్‌ పునరుద్దరణ చేపట్టనున్నారు.

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును ఆపలేం, స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు, భూవినియోగం మార్పు నోటిపికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత

ఇదిలా ఉంటే ప్రాజెక్టు భూ వినియోగంలో చట్ట విరుద్ధమైన మార్పులు, వారసత్వ సంపద పరిరక్షణ నియమాల ఉల్లంఘన, డిజైన్,పర్యావరణ అనుమతులు తదితర అంశాలను లేవనెత్తుతూ సుప్రీం కోర్టులో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై వేలాది పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు తమ వాదనలు వినిపించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుతో కేంద్ర ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్లు ఆదా అవుతుందని, హౌసింగ్ మంత్రిత్వ శాఖకు అద్దె రూపంలో చెల్లిస్తున్న డబ్బు ఆదా అవుతుందని చెప్పారు.