RIL on Contract Farming: కార్పోరేట్ వ్యవసాయంపై ముఖేష్ అంబానీ రిల్ కీలక ప్రకటన, కాంట్రాక్ట్ వ్యవసాయంలోకి రిలయన్స్ ప్రవేశించదని వెల్లడి, జియో మొబైల్ టవర్ల విధ్వంసాన్ని ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్
Mukesh Ambani (Photo Credits: IANS)

Mumbai, January 4: కేంద్రం తెచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాలు కార్పొరేట్ సంస్థ‌ల‌కు అనుకూలంగా ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్ శక్తులు లాభపడతాయన్న విమర్శల నేపథ్యంలో రిలయన్స్ కంపెనీ (RIL Statement on Contract Farming) సోమవారం స్పందించింది. కాంట్రాక్ట్ వ్యవసాయం లేదా కార్పొరేట్ వ్యవసాయంలోకి తాము ప్రవేశించమని రియలన్స్ కీలక ప్రకటన చేసింది. అంతేకాకుండా రైతుల నుంచి వ్యవసాయ భూములను కూడా కొనుగోలు చేసే ఆలోచనకు తమకు లేదని ( No Plans to Enter Contract Farming) స్పష్టం చేసింది. సోమవారం ఈ మేరకు రిలయన్స్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.

రైతులతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవ‌డం కానీ, కార్పొరేట్ ఫార్మింగ్ వ్యాపారం చేసే ఆలోచ‌న త‌మ‌కు లేద‌ని.. తామెప్పుడు వ్య‌వ‌సాయ భూముల్ని కార్పొరేట్ ఫార్మింగ్ కోసం లీజుకు తీసుకోలేద‌ని తెలిపింది. భ‌విష్య‌త్తులోనూ కార్పొరేట్ వ్య‌వ‌సాయం కానీ కాంట్రాక్టు వ్య‌వ‌సాయం చేసే ఉద్దేశం తమకు లేనే లేద‌ని రిల‌య‌న్స్ సంస్థ స్ప‌ష్టం (Reliance Industries) చేసింది. రైతుల ఆరోప‌ణ‌ల‌పై ఇవాళ ప్ర‌క‌ట‌న చేసిన రిల‌య‌న్స్ సంస్థ‌.. తామెప్పుడు ఆహార ధాన్యాల‌ను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయ‌లేద‌ని పేర్కొన్న‌ది. త‌మ‌కు స‌ప్లై చేసేవాళ్లు మాత్రం రైతుల నుంచి క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌కే ఆహార ఉత్ప‌త్తుల్ని కొనుగోలు చేస్తార‌ని రిల‌య‌న్స్ సంస్థ పేర్కొన్న‌ది.

మరో రైతు బలవన్మరణం, బీజేపీ నేతలకు లీగల్ నోటీసులు పంపిన పంజాబ్ రైతులు, డిమాండ్లు తీర్చకపోతే 26వ తేదీన ట్రాక్టర్లతో పెరేడ్‌ నిర్వహిస్తామని తెలిపిన రైతు సంఘాలు, జనవరి 4న మరోసారి కేంద్రంతో చర్చలు

భవిష్యత్తులో కూడా కార్పోరేట్ వ్యవసాయంపై తమ దృష్టిని నిలపమని రిలయన్స్ కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొంది. రైతుల నుంచి నేరుగా తాము పంటలను కొనుగోలు చేయమని, కేవలం ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం మాత్రమే తమ సరఫరాదారులు కొనుగోలు చేస్తారని తెలిపింది. తక్కువ ధరలకుండే ఏ దీర్ఘకాలిక సేకరణ ఒప్పందంలోకి తాము ప్రవేశించాలని భావించడం లేదని తెలిపింది.

రైతులు కష్టపడి పండించిన పంటలకు లాభదాయకమైన ధర లభించి, వారి కృషికి ప్రతిఫలం లభించాలన్నదే రియలన్స్, దాని సంబంధిత సంస్థల అభిమతం. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతుకే కట్టుబడి ఉండాలని మా సరఫరాదారులనూ మేం కోరుతున్నాం.’’ అని రియలన్స్ పేర్కొంది.

కొనసాగుతున్న రైతుల ఉద్యమం, 1300కు పైగా జియో సిగ్నల్‌ టవర్లను ధ్వంసం చేసిన ఆందోళనకారులు, రైతు సమస్యలు పరిష్కరించకుంటే నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించిన అన్నా హజారే

రైతుల నిరసన సందర్భంగా పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో చోటు చేసుకున్న సెల్ టవర్ల ధ్వంసం పై కూడా స్పందించింది. ఈ సెల్ టవర్ల విధ్వంసం వెనుక విదేశీ శక్తులతో పాటు వ్యాపార శత్రువులున్నట్లు తాము భావిస్తున్నామని రియలన్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలో జియో మొబైల్ టవర్ల విధ్వంసాన్ని ప్రభుత్వ అధికారులు తక్షణ జోక్యం చేసుకొని ఆపాలని కోరుతూ రిలయన్సు ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

పంజాబ్ రాష్ట్రంలో రైతుల నిరసనలు తీవ్రతరం కావడంతో గత కొన్ని వారాలుగా 1600 కు పైగా రిలయెన్సు జియో మొబైల్ టవర్లు ధ్వంసమయ్యాయి.అధికారులు జోక్యం చేసుకొని టవర్ల విధ్వంసాన్ని నిలిపివేయాలని పంజాబ్, హర్యానా హైకోర్టులో రిలయెన్సు జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ద్వారా పిటిషన్ దాఖలు చేసింది. విధ్వంసానికి పాల్పడే దుండగులు స్వార్థ ప్రయోజనాలతో, వ్యాపార ప్రత్యర్థులతో ప్రేరేపితులయ్యారని రిలయన్సు ఆరోపించింది.

మోదీ సర్కారుకు మరో ఎదురుదెబ్బ, ఎన్టీఏ నుంచి వైదొలిగిన రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ, కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ ఏకమవుతున్న ప్రతిపక్షాలు

వ్యవసాయోత్పత్తులకు కనీస మద్ధతు ధర ఇవ్వాలనే విధానానికి తాము కట్టుబడి ఉన్నామని రిలయెన్సు పేర్కొంది. రిలయెన్సు భారతీయ రైతుల ప్రయోజనాలను దెబ్బతీయదని స్పష్టం చేసింది. పంజాబ్ పోలీసులు జియో టవర్ల విధ్వంసానికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ లు దాఖలు చేయడం లేదని, దీంతో ఇలాంటి విధ్వంస ఘటనలు ఆగడం లేదని, దీనిపై డీజీపీ చర్యలు తీసుకోవాలని రిలయెన్సు అభ్యర్థించింది. కాగా జియో టవర్ల విధ్వంసంపై పంజాబ్ గవర్నరు విజయేందర్ పాల్ సింగ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను రాజ్ భవన్ కు పిలిపించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.