Jaipur, December 27: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు దేశ వ్యాప్తంగా రైతుల్లో ఆగ్రహావేశాలకు దారితీస్తోంది. గత పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందిన మూడు బిల్లులకు వ్యతిరేకంగా రైతులు, రైతు సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారం చెలాయిస్తున్నబీజేపీ నేతృత్వంలోని NDA కూటమికి మరో ఎదురుదెబ్బ (RLP Quits NDA Over Farm Laws) తగిలింది. ఇప్పటికే శివసేన, శిరోమణి అకాలీదళ్ పార్టీలు NDA కూటమికి గుడ్ బై చెప్పగా తాజాగా రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (RLP) ఆ జాబితాలో చేరింది.
శనివారం రాజస్థాన్‌లోని అళ్వార్ జిల్లాలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న రైతులను ఉద్దేశించి మాట్లాడిన RLP అధ్యక్షుడు హనుమాన్ బేనివాల్ (Hanuman Beniwal) రైతులకు వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీకి, కూటమికి తాము మద్దతివ్వబోమని (Rashtriya Loktantrik Party (RLP) ప్రకటించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, దానికి నిరసనగా ఎన్డీయే కూటమి నుంచి వైదులుగుతున్నట్లు రాజస్తాన్‌కు చెందిన బీజేపీ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) అధ్యక్షుడు హనుమాన్ బేనివాల్ ప్రకటించారు. తక్షణమే రైతుల దీక్షలకు మద్దతు తెలుపుతుమన్నామని శనివారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
దేశ రాజధాని నడిబొడ్డున చలిలో వేలాది రైతులు దీక్షలు నిర్వహిస్తుంటే కేంద్రం పట్టించుకోకపోడం దారుణమన్నారు. రైతుల డిమాండ్స్‌కు వెంటనే స్పందించి కేంద్ర ఓ నిర్ణయానికి రావాలని డిమాండ్ చేశారు. కాగా రాజస్తాన్‌లో బలమైన సామాజికవర్గం మద్దతుదారులను కలిగి ఉన్న ఆర్‌ఎల్‌పీ ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో దాదాపు 15 పార్లమెంట్ స్థానాల్లో ప్రభాల్యం కలిగిన బేనివాల్.. తాజాగా రైతు దీక్షకు మద్దతు ప్రకటించారు. రైతుల డిమాండ్స్‌పై చర్చించాలంటూ గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ సైతం రాశారు. అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాజాగా ఎన్డీయే కూటమి నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే రైతుల దీక్షకు దేశ వ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మరోవైపు నూతన వ్యవసాయ బిల్లులు (New Farm Laws) ఎన్డీయేలో చిచ్చుపెడుతున్నాయి. ఇప్పటికే ఆయా బిల్లులను వ్యతిరేకిస్తూ బీజేపీ చిరకాల మిత్రపక్షం శిరోమణీ అకాలీదళ్ ఇదివరకే ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. పంజాబ్ రైతాంగానికి మద్దతుగా ఆ పార్టీ ఎంపీ హర్‌సిమ్రాత్ కౌర్ బాదల్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా సైతం సమర్పించారు.
బిల్లులపై పార్లమెంట్‌లో చర్చసాగుతున్న తరుణంలో ఆమె ఈ నిర్ణయం తీసుకుని రైతులు మద్దతుగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతులు వ్యతిరేక విధానాలను నిరశిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా మరోసారి రైతుల నిరసన దేశ రాజధానికి తగలడంతో మరో భాగస్వామ్యపక్షం RLP కూడా ఎన్డీయే నుంచి వైదొలింది