Bengaluru, November 29: కర్ణాటకలో రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. ఉప ఎన్నికలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారపర్వంలో దూసుకుపోతున్నాయి. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు తమ దూకుడును పెంచాయి.ఈ నేపథ్యంలోనే మాండ్యా జిల్లాలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమార స్వామి(Former Karnataka Chief Minister H D Kumaraswamy) ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. మా కుటుంబానికి కన్నీళ్లు పేటెంట్‌గా మారాయి’ అంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యారు.
కేంద్ర మంత్రి సదానందగౌడ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ఖండించారు. దేవెగౌడ కుటుంబసభ్యులను ఉద్దేశించి సదానందగౌడ ( D V Sadananda Gowda) ‘ఎన్నికలలో కన్నీళ్లను వ్యాపారంగా మార్చుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. దీనికి కుమారస్వామి (HD Kumaraswamy)స్పందిస్తూ, ‘అవును, మా కుటుంబానికి కన్నీళ్లపై పేటెంట్ ఉంది.
మాది భావోద్వేగాల జీవితం. మా హృదయాలలో నొప్పిని కన్నీళ్లు వ్యక్తీకరిస్తాయి’ అని హున్సూర్‌లో మాట్లాడుతూ చెప్పారు. అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న జేడీ(ఎస్) అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్న సమయంలో, కుమారస్వామి బుధవారం కిక్కేరిలో కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ సంధర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడు నిఖిల్ ఓటమిని తలచుకొని భావోద్వేగానికి లోనయ్యారు. తనకు రాజకీయాలు అవసరం లేదని.. ప్రజల ప్రేమ ఉంటే చాలని కుమారస్వామి అన్నారు.నాకు రాజకీయాలు వద్దు(I don't need politics). సీఎం పదవి అవసరం లేదు(don't want CM post). మీ ప్రేమ మాత్రమే నాకు కావాలి.
I don't need politics
#WATCH JD(S) leader HD Kumaraswamy breaks down, in Mandya. Says "...I don't need politics, don't want CM post.I just want your love.I don't know why my son lost.I didn't want him to contest from Mandya but my own people from Mandya wanted him but didn't support him which hurt me" pic.twitter.com/reyhIsttPN
— ANI (@ANI) November 27, 2019
నా కుమారుడు నిఖిల్ ఎందుకు ఓడిపోయాడో అర్థం కావడంలేదు(I don't know why my son lost). మాండ్యా( Mandya) నుంచి అతడిని పోటీ చేయించాలని నేను అనుకోలేదు. మాండ్యా ప్రజలే నిఖిల్‌ను కోరుకున్నారు. కానీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదు. అదొక్కటే బాధ కలిగిస్తోందని కన్నీటి పర్యంతం అయ్యారు.
కాగా కర్ణాటక(Karnataka )లో మళ్లీ ఎన్నికల నగారా మోగనుంది. అక్కడ 15 అసెంబ్లీ స్థానాలకు(15 Assembly Constituencies)సంబంధించిన ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ స్థానాలకు డిసెంబర్ 5(December)న పోలింగ్ జరగనుంది. వీటి ఫలితాలు డిసెంబర్ 9(December 9)న విడుదల కానున్నాయి.