Election Commission of India. (Photo Credit: Twitter)

Bengaluru, Mar 29: క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల(Karnataka elections) షెడ్యూల్‌ను ఇవాళ రిలీజ్ చేశారు. 224 అసెంబ్లీ స్థానాల‌కు మే 10న ఒకే దశలో ఎన్నికలు, మే 13న ఓట్ల లెక్కింపు జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు.కర్నాటక ఎన్నికల్లో 9.17 లక్షలకు పైగా తొలిసారి ఓటర్లు పాల్గొననున్నారు. అలాగే, అడ్వాన్స్ అప్లికేషన్ ఫెసిలిటీ కింద, 17 ఏళ్ల+ యువకుల నుండి 1.25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.

వీటిలో ఏప్రిల్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారి నుండి కొత్తగా 41,000 దరఖాస్తులు వచ్చాయని సీఈసీ తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు మే 24తో ముగుస్తుంది. 2.62 కోట్ల మంది పురుషులు, 2.59 కోట్ల మంది మహిళలు సహా మొత్తం 5.21 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులని రాజీవ్ కుమార్, ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు.

రూ. 500 నోట్ల కట్టను గాల్లోకి విసిరన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల వేళ వివాదంలో డీకే శివకుమార్

80 ఏళ్లు దాటిన ఓట‌ర్ల‌కు.. ఇంటి నుంచే ఓటు హ‌క్కును వినియోగించుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నారు. క‌ర్నాట‌క‌లో 80 ఏళ్లు దాటిన ఓట‌ర్ల సంఖ్య 12 ల‌క్ష‌ల దాటిన‌ట్లు సీఈసీ చెప్పారు. మొత్తం ఓటర్లలో 5.55 ల‌క్ష‌ల మంది దివ్యాంగులు ఉన్న‌ట్లు సీఈసీ తెలిపారు. క‌ర్నాట‌క‌లో తొలిసారి 9.17 ల‌క్ష‌ల మంది ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు.

ఆ రాష్ట్రంలో ఉన్న గిరిజ‌న తెగ‌ల(tribal voters) ప్ర‌జ‌ల కోసం ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. 224 అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో మొత్తం 58 వేల 282 పోలింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు సీఈసీ వెల్ల‌డించారు. ప్ర‌తి పోలింగ్ స్టేష‌న్‌కు స‌గ‌టున 883.50 ఓటర్లు ఉంటార‌న్నారు. అన్ని పోలింగ్ స్టేష‌న్ల‌లో వెబ్‌కాస్టింగ్ ఫెసిలిటీ(webcasting facilities) ఏర్పాటు చేశారు. 1320 పోలింగ్ స్టేష‌న్ల‌ల‌ను కేవ‌లం మ‌హిళా అధికారులే మేనేజ్ చేయ‌నున్నారు.