Hyd, Feb 2: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR Criticizes Congress). ఆకలిచావులు, ఆత్మహత్యల తెలంగాణను పదేళ్ల పాలనతో కేసీఆర్(KCR) గారు దేశానికే అన్నపూర్ణగా నిలబెట్టారు అని గుర్తు చేసిన కేటీఆర్(KTR).. ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణను చేశారు అని దుయ్యబట్టారు.
హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో తెలంగాణ రియల్ ఎస్టేట్(Telangana Real Estate) ను కుదేలు చేశారు.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టిన పెట్టుబడులు రాక, మిత్తి కూడా ఎల్లక ఉసురు తీసుకుంటున్నారు అన్నారు. గచ్చిబౌలిలో పోలీసులపై కాల్పులు జరిపిన దొంగ.. తెలుగు రాష్ట్రాల్లో 80 కేసులు, దొంగ ప్రభాకర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో
పదేళ్ల పాలనలో వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చి కేసీఆర్(BRS President) గారు రైతులలో ఆత్మవిశ్వాసం నింపి, వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచారు.
KTR Criticizes Congress: Telangana Transformed from Annapurna to State of Suicides in a Year
ఆకలిచావులు, ఆత్మహత్యల తెలంగాణను
పదేళ్ల పాలనతో కేసీఆర్ గారు దేశానికే అన్నపూర్ణగా నిలబెట్టారు
ఏడాది కాంగ్రెస్ పాలనలో
అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణను చేశారు
హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో తెలంగాణ రియల్ ఎస్టేట్ ను కుదేలు చేశారు
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టిన… pic.twitter.com/Zh38SCSN1H
— KTR (@KTRBRS) February 2, 2025
ఏడాది రేవంత్ పాలనలో సాగునీళ్లు లేక, కరంటు రాక, పంటలు కొనుగోలు చేయక, రైతుభరోసా లేక, రుణమాఫీ గాక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నారు. ఇది ప్రజాపాలన కాదు ప్రజలను వేధించే పాలన అని సెటైర్ వేశారు.