2024 భారతదేశం ఎన్నికలు: నేడు తెలంగాణ‌కు ప్ర‌ధాని మోదీ..  జ‌హీరాబాద్, మెద‌క్ ఎంపీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ధ‌తుగా ఎన్నిక‌ల‌ ప్ర‌చారం.. పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
PM Narendra Modi (Photo Credit: X/@narendramodi)

Hyderabad, Apr 30: పార్ల‌మెంట్ ఎన్నిక‌ల (Parliament Elections) నేప‌థ్యంలో తెలంగాణ‌పై (Telangana) బీజేపీ (BJP) ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో మొన్నటికి మొన్న హోంమంత్రి అమిత్ షా (Amith Sha) పర్యటించగా.. నేడు ప్రధాని న‌రేంద్ర మోదీ (PM Narendra Modi) ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం రాష్ట్రానికి వ‌స్తున్నారు. జ‌హీరాబాద్ ఎంపీ అభ్య‌ర్థి బీబీ పాటిల్, మెద‌క్ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌ రావుకు మ‌ద్ధ‌తుగా ప్ర‌ధాని ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2 గంట‌ల‌కు అల్లాదుర్గ్‌ లోని ఐవీ చౌర‌స్తా వ‌ద్ద జ‌ర‌గ‌నున్న జ‌హీరాబాద్‌-మెద‌క్ జ‌న‌స‌భ‌లోనూ ముఖ్య అతిథిగా మోదీ హాజ‌రుకానున్నారు.

IPL 2024: పంజా విసిరిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్, 7 వికెట్ల తేడాతో పంత్ సేనపై గెలుపు, బౌలింగ్, ఫీల్డింగ్‌లో విఫ‌లైమై ఓటమిని మూటగట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

ప్రధాని మోదీ నేటి పూర్తి షెడ్యూల్ ఇలా..

  • ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం 4:20 గంటలకు హెలికాప్టర్‌లో జహీరాబాద్‌కు చేరుకుంటారు.
  • అక్కడి నుంచి జహీరాబాద్-మెదక్ జనసభ ప్రాంగణానికి వస్తారు.
  • సాయంత్రం 4:30 గంటల నుంచి 5:20 వరకు ప్ర‌జాస‌భ‌లో ప్రసంగిస్తారు.
  • ఈ సభ ముగిసిన త‌ర్వాత‌ 5:30 గంటలకు జహీరాబాద్ నుంచి దుండిగల్ ఎయిర్‌పోర్టుకు చేరుకొంటారు.
  • అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.

టీమిండియా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఔట్, టీ20 వరల్డ్‌కప్‌-2024కు భారత జట్టును ప్రకటించిన బ్రియాన్ లారా