INDIA Bloc (Photo-ANI)

ముంబై, సెప్టెంబర్ 1: ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (India Bloc) శుక్రవారం జరిగిన మూడో సమావేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని తీర్మానం చేసింది. ఈ తీర్మానంలో, వివిధ రాష్ట్రాల్లో సీట్ల భాగస్వామ్య ఏర్పాట్లు కూడా వెంటనే ఇచ్చిపుచ్చుకునే సహకార స్ఫూర్తితో చేపడతామని పేర్కొంది. ఇండియా బ్లాక్ 13 మంది సభ్యుల జాయింట్ కోఆర్డినేషన్ కమిటీని కూడా నిర్ణయించింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు ఉమ్మడిగా పోటీ చేయాలని ఈ సమావేశాల్లో తీర్మానించారు. సీట్ల పంపకాలను ఇచ్చి, పుచ్చుకునే పద్ధతిలో సాధ్యమైనంత త్వరగా, ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

భారతీయ పార్టీలైన మేం, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో వీలైనంత వరకు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. వివిధ రాష్ట్రాల్లో సీట్ల భాగస్వామ్య ఏర్పాట్లు తక్షణమే ప్రారంభించబడతాయి. ఇవ్వడం, తీసుకోవడం యొక్క సహకార స్ఫూర్తితో వీలైనంత త్వరగా ముగించబడతాయని తీర్మానం పేర్కొన్నారు. భారత పార్టీలు (INDIA Bloc) దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రజల ఆందోళన, ప్రాముఖ్యత అంశాలపై వీలైనంత త్వరగా బహిరంగ ర్యాలీలు నిర్వహిస్తాయని తీర్మానంలో పేర్కొన్నారు.

ఒకే దేశం-ఒకే ఎన్నిక, రామ్ నాథ్ కోవింద్‌తో భేటీ అయిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, జమిలి ఎన్నికల అంశంపై కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

మేము, భారత పార్టీలు, మా సంబంధిత కమ్యూనికేషన్లు, మీడియా వ్యూహాలు, ప్రచారాలను వివిధ భాషలలో జుడేగా భారత్, జితేగ ఇండియా అనే థీమ్‌తో సమన్వయం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తీర్మానం పేర్కొంది. కాంగ్రెస్‌ నేత కెసి వేల్‌నుగోపాల్‌, ఎన్‌సిపికి చెందిన శరద్‌ పవార్‌, ఆర్‌జెడి తేజస్వీ యాదవ్‌, జెఐఎంఎస్‌ హేమంత్‌ సోరెన్‌, డిఎంకెకు చెందిన ఎంకె స్టాలిన్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన అభిషేక్‌ బెనర్జీ, ఆప్‌కి చెందిన జారాఘవ్‌ ఎ చద్దా,జనతాదళ్-యునైటెడ్‌కు చెందిన లల్లన్ సింగ్, CPIకు చెందిన D రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా, PDPకు చెందిన మెహబూబా ముఫ్తీ తో 13 మంది సభ్యులతో జాయింట్‌ కోఆర్డినేషన్‌ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే జాతీయ కన్వీనర్‌ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.

వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏమిటి, కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలపై ఎందుకు అంత ఆసక్తి చూపుతోంది..

అయితే జాయింట్ కోఆర్డినేషన్ కమిటీకి 2024 లోక్‌సభ ఎన్నికలలో సీట్ల పంపకం, ఉమ్మడి కనీస కార్యక్రమం ముసాయిదా, ఉమ్మడి ప్రచార సమస్య, జాతీయ, ప్రాంతీయ లేదా రాష్ట్ర స్థాయిలలో వివిధ పార్టీలతో అనుసంధానం చేయడం వంటి కీలకమైన ఎజెండాను కూడా అప్పగించాలి. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)ని ఎదుర్కోవడానికి, కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో వరుసగా మూడోసారి గెలుపొందకుండా ఆపడానికి భావసారూప్యత గల పార్టీలు ఒక్కటయ్యాయి. జూన్ 23న బీహార్‌లోని పాట్నాలో ఉమ్మడి ప్రతిపక్షాల తొలి సమావేశం జరగ్గా, జూలై 17-18 తేదీల్లో బెంగళూరులో రెండో సమావేశం జరిగింది.

నిరంకుశ స‌ర్కార్ ప‌త‌నానికి కౌంట్‌డౌన్ షురూ : మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే

న‌రేంద్ర మోదీ సార‌ధ్యంలో కేంద్రంలోని ఎన్‌డీయే నిరంకుశ స‌ర్కార్‌ ప‌తనానికి కౌంట్‌డౌన్ ప్రారంభ‌మైంద‌ని కాంగ్ర‌స్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే (Mallikarjun Kharge) పేర్కొన్నారు. ముంబైలో జ‌రుగుతున్న విప‌క్ష కూట‌మి ఇండియా భేటీకి సంబంధించిన ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌లో షేర్‌ చేసిన ఖ‌ర్గే ఇండియా స‌మైక్యంగా నిలిచింది..ఇండియా విజేత‌గా నిలుస్తుంద‌ని క్యాప్ష‌న్ ఇచ్చారు. పురోగామి, సంక్షేమ‌, స‌మ్మిళిత ఇండియా కోసం తాము క‌లిసిక‌ట్టుగా నిలిచామ‌ని ఖ‌ర్గే రాసుకొచ్చారు. దేశంలో మార్పు అవ‌స‌ర‌మ‌ని 140 కోట్ల భారతీయులు నిర్ణ‌యించుకున్నార‌ని అన్నారు.ఈ నిరంకుశ స‌ర్కార్ ప‌త‌నానికి కౌంట్‌డౌన్ ఆరంభ‌మైంద‌ని పేర్కొన్నారు.

13 మంది స‌భ్యుల‌తో కూడిన స‌మన్వ‌య క‌మిటీ: శివ‌సేన (యూబీటీ) ఎంపీ సంజ‌య్ రౌత్

13 మంది స‌భ్యుల‌తో కూడిన స‌మన్వ‌య క‌మిటీని నియమించామ‌ని భేటీ అనంత‌రం శివ‌సేన (యూబీటీ) ఎంపీ సంజ‌య్ రౌత్ వెల్ల‌డించారు. స‌మ‌న్వ‌య క‌మిటీలో కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్‌), శ‌ర‌ద్ ప‌వార్ (ఎన్సీపీ), టీఆర్ బాలు (డీఎంకే), హేమంత్ సోరెన్ (జేఎంఎం), సంజ‌య్ రౌత్ (ఎస్ఎస్‌-యూబీటీ), తేజ‌స్వి యాదవ్ (ఆర్జేడీ), అభిషేక్ బెన‌ర్జీ (టీఎంసీ), రాఘ‌వ్ చ‌ద్దా (ఆప్‌), జావేద్ అలీ ఖాన్ (ఎస్పీ), ల‌ల‌న్ సింగ్ (జేడీయూ), డీ. రాజా (సీపీఐ), ఒమ‌ర్ అబ్దుల్లా (ఎన్‌సీ), మెహ‌బూబా ముఫ్తీ (పీడీపీ), సీపీఎం నుంచి మ‌రో స‌భ్యుడు ఉంటారని రౌత్ తెలిపారు.అన్ని రాజ‌కీయ పార్టీల‌కు చెందిన స‌భ్యుల‌తో కూడిన నాలుగు ప్ర‌ధాన క‌మిటీల‌ను ఈ స‌మావేశంలో ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. ప్రచార క‌మిటీ, సోష‌ల్ మీడియా వ‌ర్కింగ్ గ్రూప్ క‌మిటీ, మీడియా క‌మిటీ, రీసెర్చి క‌మిటీల‌ను కూడా నియ‌మించామ‌ని తెలిపారు.

కొత్త నినాదంతో 2024 ఎన్నికల బరిలోకి 

‘జుడేగా భారత్, జీతేగా ఇండియా’ నినాదంతో ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. భాగస్వామ్య పార్టీల కమ్యూనికేషన్స్, మీడియా స్ట్రాటజీలను సమన్వయం చేసుకోవాలని, ఈ ప్రచార కార్యక్రమాలను స్థానిక భాషల్లో నిర్వహించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది.అక్టోబరు 2నాటికి మేనిఫెస్టోను సిద్ధం చేయాలని టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ ఈ సమావేశంలో కోరారు. అయితే ఈ కూటమి లోగో, అధికార ప్రతినిధుల నియామకాలు జరగవలసి ఉంది.