Shivraj Singh Chouhan & Kamal Nath (Photo Credits: PTI)

New Delhi, October 19: మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత క‌మ‌ల్‌నాథ్‌.. బీజేపీ నేత ఇమార్తి దేవిపై ఆదివారం ఉప ఎన్నిక‌ల కోసం ప్ర‌చారంలో ఆమె ఓ పెద్ద ఐట‌మ్ (Kamal Nath’s ‘Item’ Comment Row) అంటూ అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ద‌బ్రా నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ప్ర‌చార స‌భ‌లో మాట్లాడుతూ.. త‌మ పార్టీ అభ్య‌ర్థి చాలా సాదాసీదా వ్య‌క్తి అని, కానీ బీజేపీ అభ్య‌ర్థి గురించి మీకు తెలుసు అని, ఆమె ఓ ఐట‌మ్ అంటూ క‌మ‌ల్‌నాథ్ (Kamal Nath) కామెంట్ చేశారు. ఆమె పేరు కూడా ఉచ్చ‌రించ‌డం నాకిష్టం లేద‌ని, ఆమె ఓ పెద్ద ఐట‌మ్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో క‌మ‌ల్ నాథ్ కామెంట్ ప‌ట్ల బీజేపీ నేత‌ల ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

ఈ విషయం మీద క‌మ‌ల్‌నాథ్ వ్యాఖ్య‌ల‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ (Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan) కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. మేడ‌మ్ సోనియాగాంధీ (Congress president Sonia Gandhi), మీ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి.. ద‌ళితురాలైన బీజేపీ మ‌హిళా అభ్య‌ర్థిని ఐట‌మ్ అని సంబోధించారు.

కాంగ్రెస్ పార్టీకి సింధియా రాజీనామా

ఇది స‌బ‌బేనా..? ‌పేద మ‌హిళ‌ల‌కు గౌర‌వం లేదా..? ఈ మాట మీకు త‌ప్పు అనిపిస్తే ఎలాంటి చ‌ర్యలు తీసుకుంటారు..? మీరు దీనిపై స‌రైన నిర్ణ‌యం తీసుకుంటార‌నే ఈ లేఖ రాస్తున్నాను. మీరు ఆయ‌న‌ను త‌క్ష‌ణ‌మే పార్టీలోని అన్ని పోస్టుల నుంచి తొల‌గించండి. అత‌ని వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించండి. లేదంటే మీరు అత‌ని వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థిస్తున్న‌ట్టుగా నేను భావిస్తాను అని శివ‌రాజ్‌సింగ్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

Here's Shivraj Singh Chouhan Tweet

ఇమార్తి దేవి (Imarti Devi) ఓ పేద రైతు ఇంట్లో పుట్టిన బిడ్డ అని మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఓ మ‌హిళా నేత‌ను ఐట‌మ్ అన్న కమ‌ల్‌నాథ్ ఫ్యూడ‌ల్ మైండ్‌సెట్ అర్థ‌మ‌వుతోంద‌ని శివ‌రాజ్ ట్వీట్ చేశారు. ఇమార్తి దేవికి మ‌ద్ద‌తుగా సీఎం చౌహాన్, బీజేపీ నేత జ్యోతిరాథిత్య సింథియాతో పాటు మ‌రికొంత మంది క‌మ‌ల్ వ్యాఖ్య‌ల‌కు నిరసనగా ఇండోర్‌లో మౌన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. పేద ఇంట్లో పుట్ట‌డం త‌ప్పా, ఓ ద‌ళితురాలిని కావడం త‌ప్పా అంటూ సోనియాను ఇమార్తి దేవి ప్ర‌శ్నించారు. మ‌హిళ‌ల‌ను, ద‌ళితుల‌ను క‌మ‌ల్నాథ్ కించ‌ప‌రిచిన‌ట్లు బీజేపీ నేత‌లు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు.

MP CM Chouhan writes to Sonia Gandhi asking her to remove Kamal Nath from his post:  

కాగా మార్చి నెల‌లో జ్యోతిరాధిత్య సింథియాతో స‌మీపంగా ఉన్న ఇమార్తి దేవితో పాటు మ‌రో 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విష‌యం తెలిసిందే. ఈ కార‌ణంగానే క‌మ‌ల్‌నాథ్ ప్ర‌భుత్వం కూలింది. అయితే 28 ఎమ్మెల్యే స్థానాల‌కు న‌వంబ‌ర్ 3వ తేదీన ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న‌ది. ఇక్కడి నుంచి సురేశ్ రాజే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.