Uddhav Thackeray: ఉద్ధవ్ థాకరే సీఎం పదవి సేఫ్, ఏకగ్రీవంగా మండలికి ఎన్నికైన మహారాష్ట్ర సీఎం, ఆయనతోపాటు మరో 8 మంది సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక
Maharashtra Chief Minister Uddhav Thackeray (Photo-PTI)

Mumbai, May 15: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Maharashtra CM Uddhav Thackeray) శాసన మండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన వెలువడింది. ఆయనతోపాటు మరో 8 మంది సభ్యులు కూడా ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) తన రాజకీయ జీవితంలో శాసన సభ్యుడిగా ఎన్నిక కావడం ఇదే తొలిసారి. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు, వన్ నేషన్,వన్ కార్డు అమల్లోకి.., రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ

మహారాష్ట్రలో (Maharashtra) ఖాళీగా ఉన్న తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ ఎన్నికలు (EC) నిర్వహించింది. ఇందులో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి అయిదుగురు, బీజేపీకి చెందిన నలుగురు పోటీలో నిలిచారు. సరిగ్గా తొమ్మిది మంది బరిలో నిలవడంతో.. వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో.. మొత్తం తొమ్మిది మంది ఏకగ్రీవంగా గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు.

మహారాష్ట్ర శాసన మండలిలో (Legislative Council) ఏప్రిల్‌ 24న తొమ్మిది మంది సభ్యుల పదవీకాలం ముగిసింది. దీంతో వీటి భర్తీకి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయగా, తొమ్మిది మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగియడంతో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి అధికారులు ప్రకటించారు.  వలస కార్మికులకు 2 నెలలు ఉచిత భోజనం, 3 పూటల భోజనానికి రూ.3500 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, వివరాలను వెల్లడించిన ఆర్థిక మంత్రి సీతారామన్

ఉద్ధవ్‌ థాకరే నేతృత్వంలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడింది. గతేడాది నవంబర్‌ 28న ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన ఇంతవరకు ఏ ప్రత్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. అందువల్ల ఏ సభలోనూ సభ్యుడు కాకపోవడంతో, మే 27 లోపు ఆయన ఏదో సభకు సభ్యునిగా ఎన్నికవ్వాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎలాంటి పోటీ లేకుండా ఉద్ధవ్‌ శాసన మండలిలోకి అడుగుపెట్టారు. దీంతో ఉద్ధవ్‌ సీఎం పదవి నుంచి దిగిపోనున్నారని కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి పూర్తి స్థాయిలో తెరపడింది.

1752262