మహారాష్ట్ర కొత్త సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేకు ఆదిలోనే ఝలక్ ఇచ్చారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. సీఎంకు మీడియా ప్రతినిధులు సంధించిన ప్రశ్నకు షిండే తడబడుతూ సమాధానాలు ఇవ్వడంతో మైక్‌ను డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లాగేసుకున్నారు.
సీఎంకు మీడియా ప్రతినిధులు సంధించిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఫడ్నవీస్ సమాధానం ఇచ్చారు. తాను మాట్లాడుతుండగానే తన ముందున్న మైక్‌ను లాగేసుకున్న ఫడ్నవీస్‌ను చూసి షిండేకు నోట మాట రాలేదు. ఫడ్నవీస్ వైపు ఓ సారి అలా చూసి మౌనం వహించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్‌గా మారిపోయింది. విశ్వాస పరీక్షలో నెగ్గిన ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర సర్కారుకు అనుకూలంగా ఓటు వేసిన 164 మంది ఎమ్మెల్యేలు, విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి 99 ఓట్లు
రెండు పర్యాయాలు సీఎంగా పనిచేసిన ఫడ్నవీస్ షిండే కేబినెట్‌లో చేరకూడదని నిర్ణయించుకున్నారు. కానీ బీజేపీ అధిష్ఠానం సూచనతో తనకు ఇష్టం లేకపోయినా ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం పదవిని చేపట్టారు. అంతేకాకుండా 2014లో ఫడ్నవీస్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగా...నాడు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న శివసేన కూడా ప్రభుత్వంలో భాగస్వామి అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షిండే కూడా నాడు ఫడ్నవీస్ కేబినెట్‌లో ఓ మంత్రిగా పనిచేశారు.
Here's Video
Mic drop. When deputy CM, Fadnavis snatch’s away the mic from Eknath Shinde the CM. Note Shinde’s priceless expression pic.twitter.com/jYPn6dntud
— Swati Chaturvedi (@bainjal) July 5, 2022
బీజేపీలో యువ నేతగా సత్తా చాటిన ఫడ్నవీస్ కు అటు రాజకీయంతో పాటు ఇటు ప్రభుత్వ పాలనలోనూ మంచి పట్టు ఉంది. మీడియా ప్రశ్నలతో పాటు విపక్షాల వ్యూహాలను తిప్పికొట్టడంలో ఆయన సిద్ధహస్తుడు. ఈ నేపథ్యంలో మీడియా సంధించిన ఓ ప్రశ్నకు షిండే తడుముకుంటూ ఉంటే.. డిప్యూటీ సీఎంగా ఉన్నా... ఫడ్నవీస్ నిభాయించుకోలేకపోయారు. వెంటనే మైక్‌ను లాక్కుని పఢ్నవీస్ మీడియాకు ఇలా దొరికిపోయారు.