మహారాష్ట్ర రాజకీయాల్లో గంట గంటలో మలుపు చోటు చేసుకుంటోంది. అస్సాం గౌహతి హోటల్‌లో తన మద్దతుదారులతో మకాం వేసిన శివ సేన రెబల్‌ గ్రూప్‌ సారధి ఏక్‌నాథ్‌ షిండేకు ఊహించని షాక్‌ తగిలింది. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారి కరోనాతో ఆస్పత్రి పాలయ్యారు. ఇక మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం ఉద్ధవ్‌ థాక్రే అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరుగనుంది. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ట్విట్టర్‌ వేదికగా స్పష్టం చేశారు. ఇక సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు.. ఆదిత్య ఠాక్రే తన ట్వి‍ట్టర్‌ ఖాతాలో మంత్రి హోదాను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)