Jyotiraditya Scindia, Smriti Irani, Anurag Thakur, Ashwini Vaishnaw, Mansukh Mandaviya (Photo Credits: PTI/ANI/Instagram)

New Delhi, July 7: రాష‍్ట్రపతి భవన్‌లో 43మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. 15మంది కేబినెట్‌ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తంగా జట్టులో కొత్తగా 43 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయడంతో ప్రధాని టీం 77కు చేరింది. తాజాగా ప్రమాణం చేసిన నూతన కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు (Modi Cabinet 2.0 Portfolios) జరిగింది.

ఇక కొత్త మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కలిసి పనిచేయడం ద్వారా బలమైన, సంపన్న భారత నిర్మాణానికి కృషిచేద్దామని పిలుపునిచ్చారు. మరోవైపు, తాజా మార్పులతో మోదీ కేబినెట్‌లో మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త జట్టుకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తామని ట్విట్టర్లో ట్వీట్ చేసిన ప్రధాని 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రేపు కేంద్ర కేబినెట్‌ భేటీ కానుంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ (Modi Cabinet Expansion) తర్వాత తొలిసారిగా ఈ భేటీ జరగనుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది. కేబినెట్‌ మీటింగ్‌లో పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.

ఏడు మంది సీనియర్లకు ఉద్వాసన పలికిన మోదీ, కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌, ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్, రమేష్ పోఖ్రియాల్ నిషాంక్, బాబుల్ సుప్రియోలు, కొత్త మంత్రులతో 77కు చేరిన ప్రధాని టీం

కాగా, బుధవారం రోజున కొత్త కేంద్రమంత్రివర్గ విస్తరణ జరిగిన విషయం తెలిసిందే. కేబినెట్‌ విస్తరణ కోసం మోదీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలు.. గడిచిన ఎన్నికలు, కేంద్ర మంత్రుల పనితీరు, సామాజిక కూర్పు, మహిళా కోటా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని కేబినెట్‌ విస్తరణ చేశారు.

ప్రధాని మోదీ కొత్త జట్టు లిస్ట్ ఇదే, 15 మంది కేబినెట్‌ మంత్రులు, 28 మంది సహాయమంత్రులు ప్రమాణ స్వీకారం, మోదీ రెండో సారి అధికారంలో వచ్చిన తర్వాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణ ఇదే

Here's Modi Cabinet 2.0 Portfolios

కొత్త మంత్రుల శాఖల వివరాలు ఇవే

నరేంద్ర మోదీ - ప్రధానమంత్రి, శాస్త్ర సాంకేతిక శాఖను పర్యవేక్షించనున్నారు.

కిషన్‌రెడ్డి - పర్యాటక, సాంస్కృతిక శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి

జ్యోతిరాదిత్య సింధియా- పౌర విమానయాన శాఖ

హర్‌దీప్‌ సింగ్‌ పూరీ - పట్టణ అభివృద్ధి, పెట్రోలియం శాఖ

మన్‌సుఖ్‌ మాండవీయ - ఆరోగ్యశాఖ

అమిత్‌ షా - హోంశాఖతో పాటు కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన సహకార శాఖ

అనురాగ్‌ఠాకూర్‌ - సమాచార, ప్రసారాలు; క్రీడలు

పీయూష్‌ గోయల్‌ - వాణిజ్య శాఖకు అదనంగా జౌళి శాఖ

అశ్వినీ వైష్ణవ్‌ - రైల్వే, ఐటీ కమ్యూనికేషన్లు

భూపేంద్ర యాదవ్‌ -కార్మిక శాఖ

పశుపతి కుమార్‌ పారస్‌ - ఫుడ్‌ ప్రాసెసింగ్‌

స్మృతి ఇరానీ- మహిళా, శిశుసంక్షేమశాఖ

ధర్మేంద్ర ప్రదాన్‌ - విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ

గిరిరాజ్‌ సింగ్‌- గ్రామీణాభివృద్ధి

పురుషోత్తం రూపాల - డెయిరీ, మత్స్య శాఖ

రాజ్‌నాథ్‌ సింగ్‌ - రక్షణ శాఖ

నితిన్‌ గడ్కరీ - రవాణా శాఖ

నిర్మలా సీతారామన్‌ -ఆర్థిక శాఖ

నరేంద్రసింగ్‌ తోమర్‌ - వ్యవసాయశాఖ

డాక్టర్‌ జైశంకర్‌ -విదేశీ వ్యవహారాలు

అర్జున్‌ ముండా - గిరిజన సంక్షేమం

పీయూష్‌ గోయల్‌ - వాణిజ్యం, పరిశ్రమలు, అదనంగా జౌళిశాఖ, ఆహార, ప్రజా పంపిణీ

ప్రహ్లాద్‌ జోషీ - పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ

నారాయణ్‌ రాణే - చిన్న, మధ్యతరహా పరిశ్రమలు

సర్వానంద్‌ సోనోవాల్‌ - ఓడరేవులు, జలరవాణా, ఆయుష్‌ శాఖ

ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ - మైనార్టీ వ్యవహారాల శాఖ

డాక్టర్‌ వీరేంద్ర కుమార్‌ - సామాజిక న్యాయం, సాధికారత

గిరిరాజ్ సింగ్‌ - గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌

రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌ - ఉక్కు శాఖ

గజేంద్రసింగ్ షెకావత్‌ - జల్‌శక్తి

కిరణ్‌ రిజిజు - న్యాయశాఖ

రాజ్‌కుమార్‌ సింగ్‌ - విద్యుత్‌, పునరుత్పాదక ఇంధన శాఖ

భూపేంద్ర యాదవ్‌ - పర్యావరణ, అటవీశాఖ, కార్మిక శాఖమహేంద్రనాథ్‌ పాండే - భారీ పరిశ్రమల శాఖ

పురుషోత్తమ్‌ రూపాల - మత్స్య, పశుసంవర్దక, డెయిరీ