New Delhi, Nov 9: మిజోరాం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రేణు శర్మ నియామకంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జొరంతంగ (Mizoram CM Zoramthanga) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె నియామకం వద్దంటూ హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ లేఖలో తమ కేబినెట్ మంత్రులకు హిందీ తెలియదని (My ministers do not know Hindi), ఇంగ్లిష్ కూడా అర్థం చేసుకోలేరని, అందువల్ల మిజో భాష తెలిసిన అడిషినల్ చీఫ్ సెక్రటరీ జేసీ రంతంగను ప్రధాన కార్యదర్శిగా (New Chief Secy Appointment) నియమించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను (Mizoram CM Urges Amit Shah) కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాల్‌నున్మవియా చువావుగో పదవీ విరమణ చేసిన తర్వాత, ప్రస్తుత అడిషినల్ చీఫ్ సెక్రటరీ జేసీ రంతంగను ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టాలని కోరానని ముఖ్యమంత్రి జొరంతంగ ఓ లేఖలో అమిత్ షాకు తెలిపారు. అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రేణు శర్మను నూతన ప్రధాన కార్యదర్శిగా నియమించిందని పేర్కొన్నారు. ఆమెకు మా భాష రాదని, అలాగే తమ కేబినెట్ మంత్రులకు హిందీ తెలియదని, ఇంగ్లిష్‌ను కూడా సరిగా అర్థం చేసుకోలేరని తెలిపారు. తన అభ్యర్థనను అంగీకరించకపోతే ప్రతిపక్షాలు తన విశ్వాసాన్ని అపహాస్యం చేస్తాయని ఆయన అన్నారు. "కాబట్టి ఆర్డర్‌ను సవరించాలని మరియు నా ప్రతిపాదనను దయచేసి అంగీకరించాలని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను" అని లేఖలో పేర్కొన్నారు.
ఈ లేఖను అక్టోబరు 29న పంపించినట్లు ముఖ్యమంత్రి సలహాదారు ప్యూ సీ లాల్రంజవువా తెలిపారు. 1988 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి రేణు శర్మకు కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 28న ఆదేశాలు ఇచ్చింది. నవంబరు 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాలని ఆదేశించింది. కానీ అదే రోజు మిజోరాం ప్రభుత్వం కూడా ఓ ఆర్డర్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నవంబరు 1 నుంచి బాధ్యతలను నిర్వహించాలని జేసీ రంతంగను ఆదేశించింది. మిజోరాంలో బీజేపీ అలయన్స్ తో అధికారం ఏర్పాటయింది.