లోక్‌సభ ఎన్నికల వేళ.. రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం బిగ్ షాక్ ఇచ్చింది. శరద్ పవార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పార్టీ పేరును ఈసీ ఖరారు చేసింది. ఎన్‌సీపీ శరద్ చంద్రపవార్ పార్టీగా నామకరణం చేసింది. అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీ(NCP)గా గుర్తిస్తూ.. గడియారం గుర్తును ఆ వర్గానికే కేటాయించింది.గత కొంతకాలంగా ఎన్సీపీలో విభేదాలు నడుస్తున్న సంగతి విదితమే.
ఎన్సీపీకి మొత్తంగా 53మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజత్ వర్గం చీలిక తర్వాత శరద్ పవార్ ఆ పార్టీపై పట్టు కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయనకు 12మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతేడాది ఎన్సీపీ నుంచి చీలిపోయిన అజిత్ వర్గం షిండే-బీజేపీ సర్కారుకు మద్దతు పలికిన సంగతి విదితమే. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Here's ANI News
'Nationalist Congress Party-Sharadchandra Pawar' -- EC approves new name for Sharad Pawar group
Read @ANI Story | https://t.co/j803JeHC3c#SharadPawar #NCP #SharadchandraPawar pic.twitter.com/mKGWVqGh2x
— ANI Digital (@ani_digital) February 7, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)