New Delhi, July 18: 15వ రాష్ట్రపతి ఎన్నిక(President Election) పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పార్లమెంట్‌లోని రూమ్ 63లో ఈ పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలైన్లలో నిలబడి ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. క్యూలైన్లలో నిలబడి ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పార్లమెంట్(Parliament) సహా ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియగించుకుంటున్నారు.
సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్(Secret Ballet Voting) విధానంలో పోలింగ్ జరుగుతోంది. ఎంపీలకు ఆకుపచ్చ(Green), ఎమ్మెల్యేలకు గులాబీ(Pink) రంగు బ్యాలెట్ పత్రాలు(Ballet Papers) ఇవ్వనున్నారు. 4809 మంది ఎలక్టరోరల్ కాలేజి(Electoral College) సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. పార్లమెంట్ హౌస్‌లోని రూమ్ నెంబర్ 63లో 6 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు.
జూలై 21న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. 25వ తేదీన కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల తరఫు అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఎంపీలు ఆకుపచ్చ రంగు బ్యాలెట్ పత్రాల్లో, ఎమ్మెల్యేలు పింక్ రంగు బ్యాలెట్ పత్రాల్లో తమ ఓటు వేయనున్నారు. బీజేడీ, వైసీపీ, బీఎస్పీ, అన్నా డీఎంకే, టీడీపీ, జేడీ(ఎస్), శిరోమణి అకాలీదళ్, శివసేన, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలు ఎన్డీయే అభ్యర్థికి మద్దతుగా ఉంటామని ప్రకటించాయి.
Prime Minister Narendra Modi votes to elect new President
#WATCH Prime Minister Narendra Modi votes to elect new President, in Delhi#PresidentialElection pic.twitter.com/pm9fstL46T
— ANI (@ANI) July 18, 2022
ఇక విపక్షాల తరఫు అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్‌తో పాటు టీఆర్‌ఎస్, ఎన్సీపీ, టీఎంసీ, ఆప్, డీఎంకే, ఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఐ, సీపీఐ(ఎం), ఎంఐఎం, ఆర్జేడీ, ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ తదితర 17 పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాగా, సొంత రాష్ట్రంలో కాకుండా వేరే ప్రదేశాల్లో 51 మంది ప్రజాప్రతినిధులు ఓటు వేయనున్నారు. పలు రాష్ర్టాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పార్లమెంటులో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.