
రాజకీయ కురువృద్ధుడు, మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మంగళవారం ప్రకటించారు. అయితే, పవార్ ఇంత అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? ఆయన ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటే తన వారసుడిగా లేదా వారసురాలిగా ఎవరికి ఆ బాధ్యతలు కట్టబెట్టబోతున్నారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.
పవార్ తన రాజీనామా ప్రకటించగానే.. ఎన్సీపీ కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఆయన రాజీనామా చేయొద్దంటూ వేదిక మీదకు ఎక్కి నినాదాలు చేశారు పార్టీ కార్యకర్తలు. రాజీనామా వెనక్కు తీసుకోవాలంటూ కోరుతున్నారు.