Clubhouse Chat Audio Leaked: మమత ఓడిపోతుంది, బీజేపీ గెలుస్తుంది, కలకలం రేపుతున్న ప్రశాంత్ కిషోర్ క్లబ్‌హౌస్ చాట్ ఆడియో టేప్, ధైర్యం ఉంటే మొత్తం చాట్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేసిన ప్రశాంత్ కిషోర్
Prashant Kishor (Photo Credits: IANS)

Kolakata, April 10: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్‌ జరుగుతోంది. టీెంసీ, బీజేపీల మధ్య వార్ నువ్వా నేనా అన్నట్లు అక్కడ నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. తాజాగా ప్రశాంత్ కిశోర్‌కు సంబంధించిన ‘క్లబ్‌హౌస్ చాట్’ ఆడియో టేప్ (Clubhouse Chat Audio Leaked) సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. సోషల్ మీడియాలో టీఎంసీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, ఇదే మమత ఓటమికి కారణం కావొచ్చంటూ పీకే ఆడియోలో (Prashant Kishor Clubhouse chat) వెల్లడించినట్లుగా ఉందనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

దీనిపై బెంగాల్ ఎన్నికలకు మమతా బెనర్జీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ((Prashant Kishor) స్పందించారు. అది అసలు తన ఆడియో కాదంటూ ట్విటర్‌ ద్వారా ఖండించారు. తమ పార్టీ నాయకుల మాటలకంటే, తన మాటలను బీజేపీ సీరియస్‌గా తీసుకోవడం ఆనందంగా ఉందంటూ ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. కొన్ని భాగాలను ఎంపిక చేసుకోవడానికి బదులు, ధైర్యం ఉంటే మొత్తం చాట్‌ను బయటపెట్టాలని పీకే డిమాండ్‌ చేశారు. అంతేకాదు బీజేపీ100 సీట్ల మార్క్‌ను దాటబోదు అంటూ ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పష్టం చేశారు.

టీఎంసీ–బీజేపీ నేతల ఘర్షణ, కాల్పుల్లో నలుగురు మృతి, సీఐఎస్‌ఎఫ్‌ పోలీసుపై దాడికి ప్రయత్నం, పరిస్థితిని అదుపు చేసేందుకు కాల్పులు జరిపిన పోలీసులు

కాగా బెంగాల్‌లో బీజేపీ ఓటమి తప్పదని గతంలో సవాల్‌ చేసిన ప్రశాంత్‌ కిషోర్‌ తాజాగా బీజేపీ గెలుస్తుందని ఆయన చెప్పినట్లుగా ఉన్న ఈ ఆడియోను పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత అమిత్ మాళవియ విడుదల చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. బీజేపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి అమిత్ మాల్వియా (Amit Malviya) పోస్ట్‌ చేసిన ఒక క్లిప్‌ ప్రకారం గత సాయంత్రం జర్నలిస్టులతో జరిగిన చాట్‌లో మమతాపై వ్యతిరేకత, దళితుల ఓట్లు బీజేపీకి కలసి రానున్నాయని, ప్రధాని మోదీకి పాపులారీటీ బాగాపెరిగిందనీ (Modi is Hugely Popular), దీంతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. దీంతో బీజేపీ నేతలు తృణమూల్ గేమ్ ఓవర్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఇదంతా బీజేపీ ఆడుతున్న డ్రామా అని టీఎంసీ మండిపడింది.

Amit Malviya Shares Leaked Audio Chat of Prashant Kishor:

Prashant Kishor Reacts:

ఇప్పటికే బీజేపీకి వందకు పైగా సీట్లు వస్తే..తాను ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయనని, ఏ రాజకీయ పార్టీకి సలహాలు, సూచనలు ఇవ్వనని టీఎంసీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ గతంలో ప్రకటించారు. కాగా బెంగాల్ ఎన్నికలు మొత్తం 8 దశల్లో భాగంగా ప్రస్తుతం నాలుగో దశకు చేరుకున్నాయి. ఈ నెల 29వ తేదీతో ముగియనున్నాయి. ఫలితాలు మే 2న రానున్న సంగతి తెలిసిందే.