Voting (Photo Credits: ANI)

Kolkata, April 17: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల 5వ దశ పోలింగ్‌ శనివారం ప్రారంభమైంది. కోల్‌కతాలోని దక్షిణేశ్వర్‌లో హిరాలాల్ మజుందర్ మెమోరియల్ కాలేజ్ ఫర్ ఉమెన్ పోలింగ్ బూత్‌ ఇద్ద ఇప్పటికే ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. 4వ దశ పోలింగ్‌ ఘర్షణల నేపథ్యంలో పోలింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. పశ్చిమబెంగాల్‌లో నేడు ఐదో దశ పోలింగ్‌లో భాగంగా రాష్ట్రంలోని 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సుమారు కోటి మంది ఓటర్లు 342 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.

నార్త్ బెంగాల్, సౌత్ బెంగాల్‌కు చెందిన ఆరు జిల్లాలలోని 45 అసెంబ్లీ సీట్లకు (West Bengal Assembly Elections 2021 Phase 5) పోటీ జరుగుతుండగా, ఆయా స్థానాల నుంచి మొత్తం 342 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో సిలిగురి నుంచి పోటీ చేస్తున్న మేయర్ అశోక్ భట్టాచార్య, రాష్ట్రమంత్రి బ్రత్య బసు, బీజేపీ నేత సమిక్ భట్టాచార్యలపై అందరి దృష్టి నిలిచింది. ఈ రోజు జరుగుతున్న పోలింగ్‌లో మొత్తం 1.13 కోట్ల మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఐదుగురు కరోనా బారినపడ్డారు.

294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్‌లో ఇప్పటి వరకు నాలుగు విడుతల్లో 159 స్థానాలకు ఎన్నికలు (West Bengal Vidhan Sabha Polls 2021) జరిగాయి. శనివారం మరో 45 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 342 అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. కోటి మంది ఓటర్లు భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఐదో దశ ఎన్నికలు ఉత్తర 24 పరగణాల్లో 16 సీట్లు, పూర్బా బర్ధమన్‌లో 8, నాడియాలో ఎనిమిది, జల్పాయిగురిలో ఏడు, డార్జిలింగ్‌లో ఐదు, కాలింపాంగ్‌ జిల్లాలో ఒక స్థానానికి పోలింగ్‌ జరుగుతోంది. మిగతా స్థానాలకు ఈ నెల 22న, 26న, 29న ఆరు, ఏడు, ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే నెల 2న ఈసీ ఫలితాలు ప్రకటించనుంది.

బెంగాల్ రాజకీయ వార్, బీజేపీ నేత రాహుల్ సిన్హాపై 48 గంట‌ల పాటు ప్రచార నిషేధం, కూచ్ బేహార్ కాల్పులపై నోరు జారిన బీజేపీ నేత, రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌కు కూడా నోటీసులు జారీ చేసిన ఈసీ

5వ దశ పోలింగ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ముఖ్యంగా మొదటిసారి ఓటర్లు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు. కమర్హతిలోని పోలింగ్ బూత్‌లో టీఎంసీ నాయకుడు మదన్ మిత్రా ఓటు వేశారు.

దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తదుపరి విడతల పోలింగ్‌పై ఎన్నికల కమిషన్ శుక్రవారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచార సమయాన్ని కుదించింది. దీనితో పాటు 72 గంటలకు (మూడు రోజులు) ముందే ఆయా విడతల ప్రచారానికి తెరపడుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. శుక్రవారం రాత్రి 7 గంటల నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్టు ఈసీ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

బీజేపీ హటావో...దేశ్ బచావో, బెంగాల్ ఎన్నికల్లో పిలుపునిచ్చిన మమతా బెనర్జీ, నందిగ్రామ్‌లో దీదీ క్లీన్‌బోల్డ్ అయ్యారని ప్రధాని మోదీ విమర్శ, బెంగాల్‌లో అధికారంలోకి వస్తే హింసకు తావు లేకుండా చేస్తామని తెలిపిన అమిత్ షా

ఎన్నికల ప్రచార రోజుల్లో రాత్రి 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ ఎలాంటి ర్యాలీలు, బహిరంగ సభలు, రోడ్‌షోలు, నుక్కడ్ సభలను అనుమతించమని ఈసీ స్పష్టం చేసింది. 6,7,8 విడతల ప్రచారానికి ప్రతి దశలోనూ 72 గంటలకు ముందే ర్యాలీలు, బహిరంగ సభలు, రోడ్‌షోలు, నుక్కడ్ సభలు, బైక్ ర్యాలీలకు తెరపడుతుందని తెలిపింది.