rs-praveen-kumar-slams-cm-revanth-reddy(X)

Hyd, Janyary 10:  కేటీఆర్ తలపెట్టిన మొబిలిటీ వ్యాలీ ఐడియాను కవర్ పేజి మార్చి భలే తస్కరించారు అని సీఎం రేవంత్ రెడ్డికి చురకలు అంటించారు బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆర్‌ఎస్పీ..ఇవాళ CII మీటింగ్ లో ఆద్యంతం ఎలక్ట్రిక్ వాహనాల గురించే మాట్లాడారు. నిజానికి ఐదు సం. ల క్రితమే కేటీఆర్ వీటి గురించి జీవోలు తీసుకొచ్చారు. ఇండస్ట్రీ లో ఆ బజ్ సృష్టించడానికే ఫార్ములా-ఈ రేసులను తీసుకొచ్చారు. దాన్ని మీరు అవినీతి అని అంటున్నారు. ఏ లాంటి చర్చకు కూడా మీరు సిద్ధంగా లేరు. ఎందుకు?? అని ప్రశ్నించారు.

అసలు మీ ఫ్యూచర్ సిటీ కి మొబిలిటీ వ్యాలీ కి తేడా ఏమిటో చెప్పండన్నారు. ఈ రోజు మీ మాటల్లో కొన్ని …ఫ్యూచర్ సిటీని కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు. 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీ లోకి తీసుకువస్తున్నాం అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్ను ను తొలగించాం అన్నారు.

భారతదేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత వేగంగా అమ్ముడవుతున్న రాష్ట్రం...ORR, RRRలను అనుసంధానించే రేడియల్ రోడ్లు కూడా నిర్మించబోతున్నాం అననననన్నారు. ORR, RRR మధ్య ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతుంది..ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, EVలు, సోలార్ వంటి పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయి.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మాతో కలిసి రండి…రండి… కలిసి అద్భుతాలు సృష్టిద్దాం..భారతదేశంలోనే కాదు… ప్రపంచంలోనే అత్యున్నత వ్యాపార సౌలభ్యాన్ని నేను మీకు అందిస్తాను..” మీరు మాట్లాడితేనేమో ఒప్పు, అదే విషయం కేటీఆర్ మాట్లాడితే తప్పు ఎట్లయితది? అసలు ఇందులో నేరమెక్కడున్నది??? అని ప్రశ్నించారు.  సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ రద్దు...మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న తెలంగాణ సీఎం.. వివరాలివే

మీరూ రోజూ కక్ష సాధింపులు చేస్తూ ప్రభుత్వ పాలసీలన్నింటి మీద అక్రమ కేసులు పెడుతూ పోతే ఏ అధికారి పనిచేస్తడు, ఏ కంపెనీ పెట్టుబడులు పెడ్తది?? చెప్పండి.??? , మీ బందువులకు బినామీలకు అప్పజెప్పినంత ఈజీ కాదు పారిశ్రామిక అభివృద్ధి రేవంత్ గారు . రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని కష్టపడాల్సి ఉంటది. ఇందులో ఎన్నో నిరాశలు తిరస్కారాలు ఉంటయి. మీ పక్కన ఉన్న అధికారులను అడగండి చెబుతారు అని చురకలు అంటించారు ఆర్‌ఎస్పీ.