Tamil Nadu Rains (photo-ANI)

Chennai, Jan 8: తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో ఆదివారం నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో నాలుగు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ విధించింది.

భారీ వర్షం కారణంగా నాగపట్టణం, కిల్వేలర్ తాలూక, విల్లుపురం, కడలోర్ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే, కల్లకురిచి, రాణిపేట, వెల్లూరు, తిరువణ్ణామలైలోనూ స్కూళ్లకు హాలిడే ప్రకటించారు. భారీ వర్షం కారణంగా రోడ్లపైకి నీళ్లు చేరడంతో ట్రాఫిక్ నత్తనడకన సాగుతోంది. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

 ఏపీలో వచ్చే 4 రోజుల పాటు భారీ వర్షాలు, దేశంలో పలు రాష్ట్రాల్లో వడగండ్లుతో కూడిన వానలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసిన భారత వాతావరణ కేంద్రం

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో పాటు ఈశాన్య గాలుల ప్రభావం తమిళనాడులో కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. మైచాంగ్ తుఫాను అంత తీవ్రంగా ఇప్పుడు ఉండదని, అయితే తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Here's Rain Videos

వచ్చే వారం రోజులు తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పది జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, మయిలదుతురై, నాగపట్టణం, తిరువూర్ జిల్లాలతోపాటు కరైకల్‌లో ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.