TS CM KCR | File Photo

Hyderabad, December 23: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా ప్రధానిగా దేశానికి పీవీ చేసిన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. నిరంత‌ర‌ సంస్కరణ శీలిగా భారత దేశ చర్రిత్రలో పీవీ చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం అన్నారు

ఆర్థిక, విద్య, భూ పరిపాలన రంగాలలో పీ.వి. నరసింహారావు ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితాన్ని నేడు భారత దేశం అనుభవిస్తున్నదని. అంతర్గత భద్రత, విదేశాంగ, వ్యవహారాల్లోనూ పీ.వి అవలంభించిన దృఢమైన వైఖరి, దౌత్యనీతి భారత దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పటిష్టపరిచిందిని సీఎం కొనియాడారు. బహు భాషా వేత్తగా, బహు ముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప పరిపాలకుడిగా అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పీవీ నరసింహారావుకు ఘనమైన నివాళి అర్పించేందుకే శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతతో నిర్వహిస్తున్నదని సీఎం గుర్తు చేశారు.

TS CMO Tweet:

పీవీ వర్థంతి సందర్భంగా హైదరాబాద్, నెక్లెస్ రోడ్ లోని పీవీ జ్ఞానభూమిలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సీఎంతో పాటు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ కేశవ రావు ఇతర నాయకులు ఈ సభకు హాజరయ్యారు, పీవీకి నివాళులు అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు.