Lifestyle of a Prince: అత్యంత ఖరీదైన వస్తువులు, కళ్లు చెదిరే ఆస్తులు. దుబాయ్ యువరాజు విలాసవంతమైన లైఫ్ స్టైల్

బ్రతికితే రాజులా బ్రతకాలి అంటారు. రాజా ది గ్రేట్, రాజు తలుచుకుంటే చీకటి వెలుగవుతుంది, బ్లాక్ అండ్ వైట్ ప్రపంచం కూడా రంగులమయం అవుతుంది. అలాంటి రాజులు, యువరాజులు ఎలాంటి విలాసవంతమైన (Luxurious) జీవితాలు గడుపుతారు? వారికి ఎంత ఆస్తులు ఉంటాయి? ఒక ఉదాహారణగా దుబాయ్ యువరాజు  (Prince of Dubai) లైఫ్ స్టైల్ (lifestyle) ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైస్ ప్రెసిడ్ర్ంట్, ప్రధానమంత్రి, అత్యంత సంపన్నుడైన మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్టోమ్ కుమారుడు, దుబాయ్ యువరాజు హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ మక్టోమ్ (Hamdan bin Mohammed Al Maktoum). ఇతణ్ని ముద్దుగా ఫజా (Fazza) అని పిలుచుకుంటారు.

2018 అధికారిక లెక్కల ప్రకారం యువరాజు ఫజా నికర ఆస్తి 400 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ. 27,98,26,00,000 కోట్లు).

ఫజా దుబాయ్ అధికారిక కార్యకలాపాల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి, అయితే అతడి హాబీస్, ఇతర ఆసక్తులతోనే అతనికి టైం సరిపోదు.

ఫజాకి అడ్వ్ంచర్స్ (Adventures) అంటే పిచ్చి. స్కైడైవింగ్ , జిప్ లైనింగ్, హార్స్ రైడింగ్ ఇలా ఒకటేమిటి ప్రపంచంలో ఎన్నిరకాల అడ్వెంచర్ గేమ్స్ ఉంటాయో అన్నింటిలో పాల్గొంటాడు. తనకి ట్రావెలింగ్ అన్నా, ఫోటోగ్రఫీ అన్నా చాలా ఇష్టం. కవితలు కూడా రాస్తుంటాడు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్.  ఇన్స్‌టా‌గ్రామ్  (Instagram) లో అతడికి 8 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

https://www.instagram.com/p/wdOWCsi1BY/?utm_source=ig_web_button_share_sheet

ఎన్నో విమానయాన సంస్థలకు యజమాని అయిన ఫజా తనకంటూ ప్రత్యేకంగా అత్యంత విలాసవంతమైన విమానాలను కలిగి ఉన్నాడు.వాటిలో తనకు ఎప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వాలిపోతాడు. అక్కడ కొన్నాళ్ల పాటు ఉంటూ అత్యంత విలాసవంతంగా కాలక్షేపం చేస్తాడు.

https://www.instagram.com/p/BY0FD4RBwr0/?utm_source=ig_web_button_share_sheet

ఫజా జంతు ప్రేమికుడు. తను పెంచుకుంటున్న ఒక ఒంటె అంటే అతనికి ఎంతో ఇష్టం. అది అత్యంత ఖరీదైన, అందమైన ఒంటెగా చెప్తారు. ఫజా ఆ ఒంటెను దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేశాడు. అయితే ఆ ఒంటె కూడా ఓ బ్యూటీ కాంటెస్టులో గెలుపొంది దాదాపు రూ. 600 కోట్ల ప్రైజ్ మనిని తనని ఎంతో ఇష్టంగా పెంచుకొనే తన యజమాని ఫజాకు బహుమతిగా ఇచ్చి రికార్డ్ కొట్టింది.

https://www.instagram.com/p/BaT49Gohu68/?utm_source=ig_web_button_share_sheet

హార్స్ రైడింగ్, హార్స్ రేసింగ్. గుర్రాలన్నా, గుర్రపు పందెలాన్నా ఫజాకు ఎంతో క్రేజ్ దాదాపు అన్ని రకాల గుర్రాల బ్రీడ్స్ ఇతని దగ్గర ఉన్నాయి. గంటలకొద్దీ సమయం ఈ ఆటపైనే వెచ్చిస్తాడు.

https://www.instagram.com/p/vD-HP6C1LX/?utm_source=ig_web_button_share_sheet

 

లగ్జరీ కార్లు, సూపర్ కార్లు. లాంబొర్గిని, బుగాటి, మెర్సిడెస్, ఫెరారీ ఇలా ఒకటేమిటి దాదాపు అన్ని పెద్ద బ్రాండ్ల నుంచి వచ్చిన అన్ని కార్లను, అన్ని సిరీస్ కార్లను లెక్కలేనన్ని కలిగి ఉన్నాడు. వీటితో పాటు వాటర్ కార్స్ , అవీ సరిపోదన్నటు అత్యాధునికమైన టెక్నాలజీ కలిగి ఉన్న యుద్ధ ట్యాంకులను కేవలం తన కలెక్షన్ లో భాగంగా కొనుగోలు చేశాడు.

https://www.instagram.com/p/p8ymGEi1N9/?utm_source=ig_web_button_share_sheet

స్వర్గం లాంటి స్కాటిష్ ఎస్టేట్- ఏదో ఇంటి స్థలాలు లాంటివి కాదు, ఇక్కడ్నించి కనిపించేదంతా తనదే కావాలన్నట్లుగా స్కాట్లాండ్ లో దాదాపు 65 వేల ఎకరాల అందమైన భూభాగాన్ని తన సొంతం చేసుకున్నాడు. అక్కడ 14 గదులతో కూడిన ఒక ఇంద్రభవనం లాంటి ప్యాలెస్ ను నిర్మించుకున్నాడు.

https://www.instagram.com/p/pGOjN-C1Gs/?utm_source=ig_web_button_share_sheet

అత్యంత ఖరీదైన వసరా (Penthouse). దాదాపు రూ. 400 కోట్లు ఖర్చు చేసి కెనడాలో ఓ హోటెల్ భవంతిలో పెంట్ హౌజ్ సూట్ ను కొనుగోలు చేశాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెంట్ హౌజ్ గా చెప్తారు.

https://www.instagram.com/p/BAC5ge_C1FQ/?utm_source=ig_web_button_share_sheet

ఇలాంటివి ఎన్నో ఎన్నో అపురూపమైన, అత్యంత విలువైన ఆస్తులుతో, అత్యంత విలాసవంతమైన జీవితంతో నిజంగా యువరాజు అంటే అర్థం ఏంటో దుబాయ్ ప్రిన్స్ చూపిస్తున్నాడు.