జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశి వల్ల కొంత మందికి అనుకూల ప్రయోజనాలు ఉంటాయి. అదే విధంగా సంఖ్య శాస్త్రంలో కూడా రాడిక్స్ సంఖ్య కలిగి ఉంటుంది. ఈ సంఖ్య వారి అదృష్టాన్ని తెలియజేస్తుంది. ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారికి డబ్బు సంపాదించడంలో ఎటువంటి లోటు ఉండదు. ఆ నాలుగు తేదీలు ఏంటో తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాడిక్స్ సంఖ్య మూడు ఉన్నవారికి అపారమైన ధన లాభం ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పటికీ ఈ వ్యక్తులపైన ఉంటాయి. వీరు కష్టపడే పని చేసే తత్వము ఉంటుంది. ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు. రాడిక్స్ 3 ఉన్నవారు విషయానికొస్తే వారి గురుడికి వారికి అధిపతి. ఈ నాలుగు తేదీల్లో జన్మించిన వారికి ప్రతిష్టాత్మకంగా సమాజంలో గౌరవం ఉంటుంది. డబ్బు సంపాదించడంలో నిపుణులుగా ఉంటారు. ఆ నాలుగు తేదీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Astrology: వందేళ్ళకు ఒకసారి వచ్చే చతుగ్రాహి యోగం ఆగస్టు 5న.
3వ తేదీ: సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా మూడో తారీకు జన్మించిన వారికి రాడిక్స్ సంఖ్య మూడు ఉంటుంది. వీరు ధైర్యం ఆత్మవిశ్వాసం వీరిలో అధికంగా ఉంటుంది. వీరు ఏ విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోరు. కానీ వీరి కృషి అంకితభావం వల్ల అన్ని పనుల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. వీరు సమాజంలో కీర్తి ప్రతిష్టను పొందుతారు. వీరు డబ్బు సంపాదించడంలో నిపుణులుగా ఉంటారు.
12వ తేదీ: న్యూమరాలజీ ప్రకారం 12వ తారీకు పుట్టిన వారికి రాడిక్స్ సంఖ్య మూడు ఉంటుంది. వీరు ఏ నెలలో అయినా 12వ తేదీన జన్మించిన వారికి చాలా మృదుస్వభావిగా ఉంటారు. వీరు ఎప్పుడు కూడా నిరాశ చెందరు. జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు. వీరికి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వీరికి ఆటోమేటిక్గా డబ్బు ఎట్రాక్ట్ అవుతుంది.
21వ తేది: ఏ నెలలో అయినా 21వ తారీకు జన్మించిన వారికి రాడిక్స్ సంఖ్య మూడు ఉంటుంది. వీరు చిన్నతనం నుండే డబ్బు విలువ తెలిసిన వారుగా ఉంటారు. వీరు డబ్బు సంపాదనను ఒక సవాలుగా తీసుకొని వారి లక్ష్యం వైపున దూసుకెళ్తారు. వ్యాపార రంగంలో వీరు పెట్టుబడులు పెడతారు. వీరు సవాలను ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు.
30వ తేదీ: ఈ తేదీన పుట్టిన వారి రాడిక్స్ సంఖ్య కూడా మూడు ఉంటుంది. ఏ నెలలో అయినా 30వ తారీకు జన్మించిన వారికి డబ్బు పరమైన లోటు ఉండదు. వీరు జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. వీరికి అఖండమైన తెలివితేటలు ఉంటాయి. డబ్బు సంపాదించడంలో వీళ్లు ముందుంటారు. కాబట్టి వీరు కష్టపడి పని చేసే తత్వం ఉంటుంది. కోరుకున్న ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. తద్వారా డబ్బు సంపాదన కూడా వీరు లక్ష్యంగా పెట్టుకుంటారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.