జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 100 ఏళ్లకు ఒకసారి కలిసే చతుర్ గ్రాహియోగం ఆగస్టు 5న ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ఈ నాలుగు రాశుల ఒక వారికి సానుకూల ప్రభావం చూపుతుంది. వందేళ్ళకు ఒకసారి వచ్చే చతుర్ గ్రాహీయోగం ఆగస్టు 5న. దీని కారణంగా అదృష్టం పొందే ఆ నాలుగు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి: ఈ రాశి వారికి రాజకీయాల పరంగా అభివృద్ధి పొందే సమయం. రాబోయే రోజుల్లో వీరు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు సామాజికంగా ఆధిపత్యాన్ని చలాయిస్తారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి వ్యాపారంలో కొత్త ఆదాయ వనరులు వస్తాయి. ఉద్యోగస్తులకు కూడా పదోన్నతి లభిస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి వ్యాపారంలో కూడా లాభాలు పెరుగుతాయి. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. మీ విజయాన్ని చూసి ప్రత్యర్థులు ఆశ్చర్యపోతారు. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. విద్యార్థులకు భవిష్యత్తులో కోరుకున్న రంగంలో ఉద్యోగాన్ని సాధిస్తారు.
Astrology: ఆగస్టు 1న సింహరాశిలోకి శుక్రుని సంచారం.
తులారాశి: ఈ రాశి వారికి ఆదాయపరంగా ఇది చాలా మంచి సమయం. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ప్రేమ వివాహాలకు అనుకూలం. మీ జీవిత భాగస్వామితోటి సంతోషంగా గడిపేందుకు అవకాశం మీకు లభిస్తుం.ది నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
కర్కాటక రాశి: వివాహితులకు ఇది చాలా శుభకరం. సంతాన లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. మీరు శత్రువుగా భావించిన వారు మిత్రులుగా మారే అవకాశం ఉంది. వ్యాపారాలు విస్తరించేందుకు అవకాశాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. దూర ప్రయాణాలకు విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగాల వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.