astrology

ఆగస్టు 1న నుండి సింహరాశిలోకి శుక్రుని సంచారం. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి ధన ప్రాప్తి.

సింహరాశి: ఈ రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొత్త వ్యాపారం కోసం భూమిని కొనుగోలు చేస్తారు. యువత విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఉత్తమమైన ర్యాంకు వస్తుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విహారయాత్రలకు వెళ్లి అవకాశాలు ఉన్నాయి.

కర్కాటక రాశి: సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాలకు వెళ్లే అవకాశం ఉంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా కృషి చేస్తారు. విద్యార్థులు ఉన్నత చదువులలో రాణిస్తారు.

తులారాశి: ఈ రాశి వారికి భవిష్యత్తు చాలా సంతోషకరంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. డబ్బు సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తారు. వ్యాపారాల వల్ల లాభాలను పొందుతారు. కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది. స్నేహితులతో గడుపుతారు దూర ప్రయాణాలకు వెళ్లే అవకాశం ఉంది.

Health Tips: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు.. 

వృషభ రాశి: ఈ రాశి వారికి దానధర్మాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. రాబోయే రోజుల్లో మీకు అన్నీ కూడా శుభ సమయాలే. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశీయానం ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడుపుతారు.

ధనస్సు రాశి: ఈ రాశి వారికి అపారమైన మేదస్సుతో వ్యాపారంలో ప్రయోజనాలు పొందుతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయం. వ్యాపారం నుండి ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ప్రేమ వివాహాలకు అనుకూలం. ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న రుణ సమస్యల నుంచి బయటపడతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతల విద్య అవకాశం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.