ఆదివారం సూర్యునికి ఎంతో ఇష్టమైన రోజు ఆరోజు పూజలు చేయడం ద్వారా మనము మన అదృష్టాన్ని పెంచుకోవచ్చు. ఆదివారం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి కొన్ని పనులు చేయడం ద్వారా. ఎప్పటినుండో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. ఆగస్టు 18 ఆదివారం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి సూర్యునికి నీరు సమర్పించడం ద్వారా విశేష ఫలితాలు కలుగుతాయి. సూర్యునికి నీరు సమర్పించడంతో పాటు ఈ మూడు పనులు చేసినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు పనులేంటో ఇప్పుడు చూద్దాం.
రావి చెట్టు కింద దీపం వెలిగించండి.
ఆదివారం రోజు ఉదయం రావి చెట్టు కింద బియ్యప్పిండితో చేసిన దీపాన్ని వెలిగించాలి. ఆ దీపంలో ఆవనూనె పోసి నింపాలి. ఈ విధంగా చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. దీంతోపాటు రావి చెట్టు దగ్గర ఒక ఆకును తీసుకొని దానిపైన మీ కోరికలు రాయండి. తర్వాత ఆ ఆకును ప్రవహించే నీటిలో వేయడం ద్వారా మీ కోరికలు నెరవేరుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు.
Astrology: ఆగస్టు 26 నుండి బుధాదిత్య శుక్రాదిత్య రాజయోగం
తులసి చెట్టుకు పాలు పోయండి.
ఆదివారం రోజు ఉదయం సూర్యునికి నమస్కరించిన తర్వాత ఆయన మంత్రాలని జపించి రాత్రి పడుకునే ముందు ఒక చిన్న గ్లాసులో కొన్ని పాలను తీసుకొని దేవుడి గదిలో ఉంచండి. మరసటి రోజు అంటే సోమవారం తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత స్నానాలు ఆచరించిన తర్వాత ఆ పాలను తులసి చెట్టు వేర్ల దగ్గర పోయాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది.. లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
చీపురు దానం చేయండి
చీపురును లక్ష్మీదేవిగా కొలుస్తారు ఇది ఎంతో శుభప్రదం చీపురును ఆదివారం రోజు కొనుక్కొని ఇంటికి తీసుకురండి. మరసటి రోజు సోమవారం నాడు ఆ చీపురును ఆలయానికి వెళ్లి ఎవరికైనా దానం చేయండి. ఇలా దానం చేయడం ద్వారా మీకు అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాకుండా మీ ఆస్తులు పెరుగుతాయి. నూతన గృహాన్ని కూడా కొంటారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.