astrology

ఆగస్టు 13 రాత్రి 10 గంటలకు శనిగ్రహం పూర్వభద్ర నక్షత్రం ద్వితీయ స్థానం నుండి మొదటి స్థానంలోకి ప్రవేశిస్తుంది. ఈ మార్పు కారణంగా అన్ని రాశుల పైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీన రాశి:  శని గ్రహ సంచారం కారణంగా ఈ మీన రాశి వారికి జీవితాల పైన అనుకూల ప్రభావం ఉంటుంది. వీరు వ్యాపారంలో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చాలా ఆలోచించి తీసుకుంటారు. దానివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. మీ ఆర్థిక లాభాలు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. పెద్ద మొత్తంలో మీ వ్యాపారాన్ని విస్తరిస్తారు. దీని ద్వారా మీకు ఉపశమనం కలుగుతుంది. మీరు తీసుకున్న అప్పులను చెల్లిస్తారు భాగస్వామి సహకారంతో మీ వ్యాపార విస్తరణ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. మీ పై అధికారుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి. పని నుంచి ఒత్తిడి తగ్గడం వల్ల మీరు మానసికంగా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ప్రేమ వివాహాలకు అనుకూలం.

సింహరాశి: భాద్రపద నక్షత్రం మొదటి స్థానం నుంచి శని సంచారం వల్ల ఈ సింహ రాశి వారికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాపారంలో ఏర్పడిన సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికపరమైన నష్టాలు ఏమి ఉండవు. కొత్త వ్యాపార ఒప్పందాలు మీకు ఊరట లభిస్తుంది. మీకు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. విద్యార్థులు తమ ప్రాజెక్టులతో సీనియర్ల నుండి సహాయాన్ని పొందుతారు. స్కాలర్షిప్ పొందడంలో కూడా వీరికి ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఇన్ఫెక్షన్ లో వచ్చే జబ్బుల నుండి ఉపశమనాన్ని పొందుతారు. మనసు ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామి తోటి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారులు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి విదేశీయానాన్ని చేస్తారు.

Astrology: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి..ఎలా జరుపుకోవాలి ...

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి శని సంచారం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారానికి సంబంధించి ఎప్పటినుంచో ఉన్న ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి. పెద్ద వ్యాపార ఒప్పందాన్ని పొందడం ద్వారా ఆర్థికంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీ ఆదాయం. గా పెరిగే అవకాశం ఉంది సొంత ఇల్లును లేదా ఫ్లాట్ ను కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. విద్యార్థులు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.