జ్యోతిష శాస్త్రం ప్రకారం శని చాలా ప్రభావంతమైన గ్రహం. ఈ గ్రహం కదలిక చాలా నెమ్మదిగా ఉంటుంది. ఆగస్టు 16న శని గ్రహం గమనంలో మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వారికి జీవితంలో సంక్షోభం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కష్టకాలం ఎదురవుతుంది చెడు పరిస్థితులు ఉంటాయి. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీన రాశి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం కదలికల మార్పు వల్ల ఈ మీన రాశి వారిపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వీరిలో ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. వీరిలో దూకుడు తను బాగా పెరిగి గొడవలకు దారితీస్తుంది. ఆర్థికంగా చాలా నష్టపోతారు. కోరుకున్న కోరికలు నెరవేరవు. అనైతిక మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. దాని వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారంలో నష్టాలు పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఆశించిన స్థాయిలో ర్యాంకు రాదు. వీరి కమ్యూనికేషన్ స్కిల్స్ పూర్తిగా దెబ్బతింటాయి. సమాజంలో మీ సామర్ధ్యాన్ని అనుమానిస్తారు .ఆరోగ్య సంబంధ సమస్యల పైన తీవ్ర తీవ్ర ఇబ్బంది ఎదురుకోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో గొడవపడే అవకాశాలు చాలా ఉన్నాయి.
Astrology: ఆగస్టు 25 నుంచి శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం.
తులారాశి: శని గమనంలో మార్పుల కారణంగా ఈ తులా రాశి వారికి ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. స్నేహితుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో అపారమైన ధన నష్టం పెరుగుతుంది. ఆర్థిక సంక్షేమం ఏర్పడుతుంది. డబ్బు నష్టం కారణంగా మానసికంగా శారీరకంగా ఆందోళన చెందుతారు. కొన్ని రకాలైన మానసిక సమస్యలతో ఇబ్బంది పడతారు. మెదడుకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ స్నేహితులను మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. మీ పిల్లల వల్ల మీరు సమాజంలో తలెత్తుకునే పరిస్థితి ఉండదు. ఉద్యోగం చేసే వారికి సహోదయోగులతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలకు వాహనాల్లో వెళ్ళరాదు. ఆక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది.
కర్కాటక రాశి: శనిగమనంలో మార్పు కారణంగా మీలో తీవ్ర ఆందోళన ఒత్తిడి చిరాకు అసహనం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో గొడవపడే అవకాశం ఉంటుంది. తద్వారా మీ వైవాహిక జీవితంలో విడిపోయే సంక్షేమం కూడా ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు తమ కోరుకున్న రంగంలో సీటు లభించదు. వీరి మనసు ఇబ్బంది పడుతుంది. మీరు చేయాల్సిన పనులు పూర్తి కాలంలో చేయరు. వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనువైన సమయం కాదు. కుటుంబ సభ్యులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో తీవ్ర నష్టం వస్తుంది. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారు కాస్త ఆగడమే మంచిది. మీ యజమాని నుండి మీకు మందలింపులు పెరుగుతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.