జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 17 శని త్రయోదశి శనివారం రోజు ప్రీతియోగం ఏర్పడుతుంది. ఈ యోగం కలయిక వల్ల మూడు రాశులు వారికి కలిసి వస్తుంది ఆ మూడు రాశులు ఏంటో తెలుసుకుందాం.
కుంభరాశి: ఈ రాశి వారికి ఆగస్టు 17 నుండి ఆర్థికంగా కలిసి వస్తుంది. పెళ్లి కాని వారికి త్వరలోనే వివాహాలయ్యే అవకాశం ఉంది. మీరు డబ్బు సంపాదించడానికి అనేక కొత్త మార్గాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉంటారు. ఎప్పటినుంచో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. నీ భాగస్వామితో వివాదాలు ముగిసిపోతాయి. విదేశాలకు వెళ్లాలన్న కల నెరవేరుతుంది. పూర్వికులు ఆస్తి విషయంలో మీకు మీ కుటుంబ సభ్యులకు మరుగు జరుగుతున్న వివాదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు కోరుకున్న రంగంలో ఉద్యోగం లభిస్తుంది.
మిథున రాశి: ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఉన్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. మానసికమైన ఒత్తిడి నుంచి బయటపడతారు. క్రీడారం రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు వారి అదృష్టం పెరుగుతుంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. వ్యాపారులు తమ వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి ఇది అనుకూలమైన సమయం. కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. ఆఫీస్ లో మీకు మీ పై అధికారులకు మధ్య ఉన్న గొడవలు తగ్గిపోతాయి.
Astrology: 90 ఏళ్ల తర్వాత వచ్చే చతుర్ గ్రహియోగం ఆగస్టు 19న
తులారాశి: ఆస్తి వివాదాలు కోర్టు సమస్యల నుంచి కూడా బయటపడతారు. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులకు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా పురోగతి ఉంటుంది. సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది. విదేశాలకు వెళ్లాలన్న ఆలోచన కళ నెరవేరుతుంది. విద్యార్థులకు భవిష్యత్తులో కోరుకున్న రంగాలలో సీట్ లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు వ్యాపారానికి పెట్టుబడి పెట్టడానికి ఇది అనువైన సమయం.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.