ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి వస్తుంది. ఈసారి రాఖీ పండుగ అనేక శుభయోగాలను తేస్తుంది. ఐదు రాశుల ఏమిటో తెలుసుకుందాం.
వృషభ రాశి: ఈ రాశి వారికి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వారి ద్వారా మీకు ధన లాభం ఉంటుంది. రాజకీయ లకు సంబంధించిన వ్యక్తులకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. పెళ్లి కాని వారికి త్వరలోనే వివాహయోగం. ఎప్పటినుంచ ఇబ్బంది పడుతున్న కొన్ని రకాలైన వ్యాధుల నుండి ఉపశమనాన్ని పొందుతారు.
మిథున రాశి: ఉద్యోగస్థలం కొన్ని శుభవార్తను వింటారు. మానసిక ఒత్తిళ్ల నుండి బయటపడతారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం మీ వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. మీ ఇంట్లో ఒక శుభకరమైన వార్తను వింటారు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో మొదటి స్థానం వస్తుంది.
ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఎప్పటినుంచో కోట్ల పెండింగ్ ఉన్న సమస్య నుండి బయటపడతారు. ఆర్థికంగా ఇప్పటివరకు ఉన్న ఇబ్బందుల నుండి బయటపడతారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు పెరిగి మీ సంపాదన పెరుగుతుంది. మీరు తీసుకున్న అప్పులను చెల్లిస్తారు.
Health Tips: బరువు తగ్గడానికి టీ మానేయాలా..?
మేష రాశి: ఈ రాశి వారికి ఉన్నత విద్యకు అవకాశాలు లభిస్తాయి. మీరు కోరుకున్న కాలేజీలలో సీటు వస్తుంది. పెద్ద కంపెనీలో పనిచేసే వారి కి జీతాలు పెరుగుతాయి. మీ ఉద్యోగంలో కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందుల నుండి బయటపడతారు.
కర్కాటక రాశి: విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. నూతన వాహనాలు కొనుగోలు కొనుగోలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం. ప్రేమ వివాహాలకు అనుకూలం. ఆరోగ్య సమస్యల నుండి ఇబ్బంది తగ్గుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.