ఆగస్టు 23 న గణపతికి ఎంతో ఇష్టమైన చతుర్థి ఈరోజు వినాయకుని పూజించుకుంటే అన్ని శుభయోగాలు జరుగుతాయి. ఆగస్టు 23వ తేదీ ఉదయం10 గంటలకు మొదలవుతుంది. 24 తారీకు ఉదయం 11 గంటలకు ముగుస్తుంది. ఈరోజు బ్రహ్మ ముహూర్తము నాలుగు గంటల నుండి 5 గంటల మధ్య గణేశుడికి పూజించుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది.
ఆరోజు చేయవలసిన పనులు: ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. గణేశునికి పూజ చేయాలి ఉపవాసం ఉంటే మంచిది. గణేశుడికి మోదకాలు, పండ్లు ,దర్భాన్ని సమర్పించాలి. ఆవుకు మేత తినిపించాలి. రాత్రిపూట శంఖంలో పాలు పోసి చంద్రుడికి చూపించాలి. ఈ విధంగా పూజ చేస్తే మీకు ధనవర్షం కురుస్తుంది. గణేశుడికి ఇష్టమైన మూడు రాశులు ఇవే.
మేష రాశి: ఈ రాశి వారికి గణేశుని దయ ఎల్లప్పుడూ ఉంటుంది మీరు మీ పిల్లలు మీ కుటుంబంలో ఒక శుభవార్తను వింటారు. మీ వ్యాపారము వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ వివాహాలకు అనుకూలము కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయము. విద్యార్థుల భవిష్యత్తు ప్రయోజనకరంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో రాణిస్తారు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Astrology: ఆగస్టు 22న శుక్రుడు పాల్గొని నక్షత్రంలోనికి ప్రవేశం.
కన్యా రాశి: గణేశునికి ఇష్టమైన రాశుల్లో కన్యా రాశి కూడా ఒకటి ఈ రాశిలో వారికి అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా యువత తమకేరియర్లో పురోగతి సాధించడానికి కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ సహ ఉద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు ఏ పనైనా ప్రారంభిస్తే దాన్ని సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఇంటికి కొత్త అధితులు రావచ్చు. కొన్ని శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
తులారాశి: ఈ రాశి వారికి గణేశుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపారవేత్తలు ఎప్పటినుంచో ప్రారంభించాలనుకున్న పెట్టుబడుల్లో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. రావాల్సిన మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఆరోగ్యపరంగా అంతా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కొత్త ప్రాజెక్టులు పని చేసే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.