laxmi devi

తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసం ఎంతో పవిత్రమైనది.  శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పండగ వాతావరణం ఏర్పడుతుంది.. ఈ శ్రావణ మాసంలో మహిళలందరూ చాలా రకాలైనటువంటి నోములు, వ్రతాలు చేసుకుంటారు. ఇది ఎంతో శుభకరం అని వారు భావిస్తారు. లక్ష్మీదేవిని పూజించడం ద్వారా వారికి సకల సంపదలు కలుగుతాయని నమ్మకం. వరలక్ష్మీ వ్రతం చేయడం వల్ల ఆర్దికంగా కూడ ఎటువంటి సమస్యలు రావని నమ్మకం. అంతేకాకుండా వారి భర్త ఆరోగ్యం పిల్లల ఆరోగ్యం కూడా బాగుండాలని స్త్రీలు ఉపవాసాలు ,వ్రతాలు చేస్తారు. అయితే గర్భిణీలు వరలక్ష్మీ వ్రతం చేయవచ్చా అనే సందేహం చాలా మందికి వస్తుంది. ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం

Health Tips: మహిళల్లో మెనోపాజ్ తర్వాత గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది ...

అయితే గర్భిణీ స్త్రీలు సాధారణ మహిళలు లాగానే వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోవచ్చు. అయితే ఉపవాసం ఉండకూడదు. ఉపవాసం వల్ల కడుపులోని బిడ్డకు ఇబ్బంది కలుగుతుంది. కేవలం ఆ ఒక్క కారణంతోనే ఉపవాసం ఉండకూడదు అని చెప్తారు. కనుక గర్భిణీ స్త్రీలు ఎటువంటి అనుమానం లేకుండా వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు. అయితే వరలక్ష్మీ వ్రతం చాలా నిష్టతో కూడుకున్నది. అదే విధంగా పని ఎక్కువగా ఉంటుంది. ఇల్లు అంత శుభ్రం చేసుకోవడం రకరకాల నైవేద్యాలు ,పిండి వంటలు చేయడము ఇవన్నీ కూడా కొంత శ్రమతో కూడుకున్నవి. కాబట్టి గర్భిణీ స్త్రీలు కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు మీ ఇంట్లో వాళ్ల సహాయంతో వరలక్ష్మీ వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఆ తల్లి చల్లని దీవెనలు మీకు ఎప్పటికీ ఉంటాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.