Image is for representational purpose only (Photo Credits: Flickr)

భారతదేశంలో అతిపెద్ద పండుగలలో ఒకటి వినాయక చవితి ఈసారి వినాయక చవితి సెప్టెంబర్ 7న వచ్చింది. సెప్టెంబర్ 7 నుండి 17 వరకు జరుపుకుంటారు. ఈ సంవత్సరం వినాయక చవితి చాలా ముఖ్యమైనది. వినాయక చవితి పండగ రవిపుష్యయాగం, సర్వాంతసిద్ధి యోగం కలిసి వస్తుంది. ఈ రెండు యోగాల కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశి వారికి వినాయక చవితి నుండి అదృష్టం కలిసి వస్తుంది. విద్యార్థులకు వ్యాపారవేత్తలకు ఈ వినాయక చవితి నుండి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు తమ ఎంచుకున్నా రంగంలో ఉత్తీర్ణత అవుతారు. అంతేకాకుండా వారి ప్రాజెక్టులు పూర్తిచేస్తారు. పరీక్షల్లో మంచి ర్యాంకు సాధిస్తారు. దీని ద్వారా మీకు స్కాలర్షిప్ వస్తుంది. వ్యాపారస్తులు తమ కొత్త పెట్టుబడులను పెట్టడానికి ఇది అనువైన సమయం పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీ వ్యాపారాలు కొత్త వెంచర్లను వేయడానికి సన్నాహం చేస్తారు. భార్య లాభాల మార్జిన్లు వస్తాయి. కుటుంబ జీవితంతో సంతోషంగా గడుపుతారు .విదేశీయానం ఉంటుంది నూతనంగా గృహాన్ని కొనుగోలు చేస్తారు.

Astrology: ఆగస్టు 26 నుండి బుధాదిత్య శుక్రాదిత్య రాజయోగం..

తులారాశి: ఈ రాశి వారికి గణేశుడు అనుగ్రహం వారి జీవితంలో కొత్త సంతోషాలను తీసుకొని వస్తుంది. వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారి చేపట్టే ప్రతి ఒక్క పనిలో కూడా సానుకూలమైన ఫలితాలు వస్తాయి. దీని ద్వారా మీ మనోబలం పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి ఇది మంచి సమయం. మీ ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ వస్తాయి. వైవాహిక జీవితంలో భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి గణేష్ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. గణపతి కి ఇష్టమైన రాశి కర్కాటక రాశి. వీరికి అనేక వనరుల నుండి ఆదాయం వస్తుంది. మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదలను ఉంటాయి. వ్యాపారస్తులు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. మీకు భారీ లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు మీ ఆదాయం పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎప్పటినుండో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుండి బయటపడతారు. కోర్టులో పెండింగ్లో ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.